Telugu Global
National

‘అగ్నిపథ్ ఆందోళనకారులకు’ మద్దతుగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశంలో పలు చోట్ల ఆందోళనలు, నిరసనలకు దిగిన ఆర్మీ అభ్యర్థులకు సంఘీభావ సూచకంగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ సత్యాగ్రహం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీసు బేరర్లు, ఇతర నేతలు పాల్గొంటారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. ఈ అగ్నిపథకం పట్ల దేశ యువత ఆగ్రహంతో ఉందని, వారు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల […]

congress-Satyagrah-agnipath
X

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశంలో పలు చోట్ల ఆందోళనలు, నిరసనలకు దిగిన ఆర్మీ అభ్యర్థులకు సంఘీభావ సూచకంగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ సత్యాగ్రహం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఆఫీసు బేరర్లు, ఇతర నేతలు పాల్గొంటారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. ఈ అగ్నిపథకం పట్ల దేశ యువత ఆగ్రహంతో ఉందని, వారు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మా పార్టీపై ఉందని చెప్పారు. ఈ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని తాము మొదటినుంచీ కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీన్ని వెనక్కి తీసుకునేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

బీహార్ సహా 11 రాష్ట్రాలకుపాకిన ఆందోళన

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ నాలుగోరోజైన శనివారం కూడా బీహార్ లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ రాష్ట్రంతో బాటు ఢిల్లీ, యూపీ, హర్యానా, ఒడిశా, బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. బీహార్ లోని జెహానాబాద్ లో బస్సులు, ట్రక్కులకు, మరికొన్ని వాహనాలకు నిప్పంటించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. యూపీలోని బలియా జిల్లాలో ఓ రైలుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు మరికొన్నింటిని ధ్వంసం చేశారు.

యూపీలోని వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ, మధుర జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. అలీగఢ్ లో స్థానిక బీజేపీ నేతకు చెందిన కారును నిరసనకారులు తగులబెట్టారు. హర్యానాలోని బల్లభ్ గడ్ లో యువకులు కొందరు పోలీసులపై రాళ్లవర్షం కురిపించగా రోహతక్, జింద్ జిల్లాల్లో టైర్లకు నిప్పంటించారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఆగ్రా-బందికు రైల్వే పట్టాలపై బైఠాయించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు ఖాకీలు బాష్పవాయువు ప్రయోగించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన హింసాత్మక ఘటనలు జరిగాయి. అగ్నిపథ్ పథకం వల్ల యువతకు మంచే జరుగుతుందని కేంద్ర మంత్రులు చెబుతున్నా ఆర్మీ అభ్యర్థులు శాంతించడం లేదు. నాలుగేళ్ళ తరువాత తమ గతేమిటన్నదే వారిని వేధిస్తోంది.

First Published:  18 Jun 2022 2:32 AM GMT
Next Story