Telugu Global
NEWS

బైజూస్ అంటే హెరిటేజ్‌లో దొరికే జ్యూస్ కాదు.. బాబుకు బొత్స గట్టి కౌంటర్

ఏపీలోని విద్యారంగంపై మొదటి నుంచి తొలి ప్రాధ్యాన్యత ఇస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తాజాగా బైజూస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధనిక, మధ్య తరగతే కాకుండా పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఎడ్యూటెక్ సంస్థ ‘బైజూస్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ కుదుర్చుకున్న ఈ […]

AP-Minister-Botsa-strong-counter-Chandrababu11
X

ఏపీలోని విద్యారంగంపై మొదటి నుంచి తొలి ప్రాధ్యాన్యత ఇస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తాజాగా బైజూస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధనిక, మధ్య తరగతే కాకుండా పేదలు కూడా ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఎడ్యూటెక్ సంస్థ ‘బైజూస్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

దావోస్ పర్యటనలో సీఎం జగన్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం వెంటనే అమలులోకి వచ్చింది. వేలాది రూపాయల విలువైన పాఠ్యాంశాలను ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగానే అందించడానికి ముందుకు వచ్చింది. రాబోయే కాలంలో ఏపీలో సీబీఎస్ఈ పాఠ్యాంశాలు బోధించనున్నందున.. అందుకు విద్యార్థులందరినీ సమాయత్తం చేసేందుకే బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు.

కాగా, ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ”అది బైజూస్ కాదు.. జగన్ మోహన్ రెడ్డి జ్యూస్” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

‘అసలు చంద్రబాబుకు బైజూస్ అంటే తెలుసా? జ్యూస్ అంటే ఎగతాళి చేయడానికి అదేమైనా హెరిటేజ్‌లో దొరికే మ్యాంగో జూస్ అనుకున్నారా? నీ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదవాలి.. పేదలకు మాత్రం ఆ చదువులు వద్దా? బాబుకు ఖాళీగా ఉండటం అలవాటు అయ్యి.. మతిపోయి.. సహనం కోల్పోయి.. పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు’ అంటూ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బైజ్యూస్ అంటే ఏంటో నీ మనుమడిని అడుగు అంటూ బొత్స ప్రశ్నించారు.

35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇవ్వడానికే బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామని.. పిల్లల చదువులను కూడా రాజకీయం చేయవద్దని చంద్రబాబుకు బొత్స హితవు పలికారు. ఇక వైజాగ్ అభివృద్ది వైఎస్ఆర్ వల్లే జరిగింది.. దీనిపై చర్చకు రమ్మంటే వస్తాను అన్నారు. నీ భాష, వ్యవహారం మార్చుకో అంటూ చంద్రబాబుకు బొత్స సూచించారు.

First Published:  18 Jun 2022 5:50 AM GMT
Next Story