Telugu Global
NEWS

వెల్లంపల్లికి, యువకుడికి ఆసక్తికరంగా వాగ్వాదం

గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక యువకుడు నాగబాబుకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. యువకుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ పక్కనే ఉన్న సీఐను పిలిచి అతడిపై కేసు నమోదు చేయాలని సూచించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ రూ.1500 కోట్లు అవినీతి చేశారంటూ ఇటీవల టీడీపీ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ నాగబాబు నిలదీయడంతో వాగ్వాదం మొదలైంది. ” […]

interesting-argument-Vellampalli-and-young-man
X

గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక యువకుడు నాగబాబుకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. యువకుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ పక్కనే ఉన్న సీఐను పిలిచి అతడిపై కేసు నమోదు చేయాలని సూచించారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ రూ.1500 కోట్లు అవినీతి చేశారంటూ ఇటీవల టీడీపీ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ నాగబాబు నిలదీయడంతో వాగ్వాదం మొదలైంది. ” పిచ్చిపిచ్చిగా టీడీపీ వారిలాగా మాట్లాడుతున్నావేంటి?, టీడీపీ వారి మీద పెట్టినట్టే నీ మీద కేసు పెట్టమంటావా?. తమాషాగా ఉందా. నేను 1500 కోట్లు అవినీతి చేశానని ఎలా అంటావ్‌” అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

” కేసు పెట్టుకోండి.. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారాన్నే తాను చెబుతున్నా” అంటూ యువకుడు ఎదురు మాట్లాడారు. దాంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు అవసరం లేని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావ్. ప్రభుత్వం నుంచి ఏం కావాలో అడుగు అంతే కానీ లేనిపోని మాటలు ఎందుకు మాట్లాడుతావ్ అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో సదరు యువకుడు ”సరే ఆ విషయాన్ని వదిలేయండి. మీ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది. దానికి ఏం సమాధానం చెబుతారు” అంటూ ప్రశ్నించాడు. తాను ప్రభుత్వానికి టాక్స్‌ కడుతున్నానని అందుకే అడుగుతున్నా అంటూ వాదన పెట్టుకున్నాడు. ఆగ్రహించిన వెల్లంపల్లి.. చెన్నైలో ఉంటున్నావ్. ఇక్కడ ఏం టాక్స్ కడుతున్నావ్‌ అంటూ ప్రశ్నించారు. పక్కనే ఉన్న సీఐను పిలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్.. ”ఈ వ్యక్తి నేను 1500 కోట్ల అవినీతి చేశానంటున్నాడు.. నిరూపించకపోతే కేసు పెట్టండి” అంటూ సూచించారు.

అప్పటికీ ఆ యువకుడు దారికి రాలేదు. నా దగ్గర సమాచారం ఉందంటూ మాట్లాడారు. దాంతో వెల్లంపల్లి శ్రీనివాస్‌.. ఆ సమాచారమే ఉంటే పోలీసులకు చూపించూ లేదంటే కేసు పెట్టిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాగా ఉందా.. నోరు మూయ్‌ అంటూ వెల్లంపల్లి ఆగ్రహించారు. ప్రతివాడికి తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిని విచారించాలని.. ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేకపోతే కేసు కట్టి లోపలేయాలని సీఐను ఆదేశించారు. ఏం చర్యలు తీసుకున్నారో కూడా తనకు చెప్పాలని సీఐకు వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు.

First Published:  18 Jun 2022 5:14 AM GMT
Next Story