Telugu Global
MOVIE UPDATES

రిత్విక్ సోదిగా మారిన వెన్నెల కిషోర్

ఇటీవల వినూత్నమైన పోస్టర్స్‌తో.. వైవిధ్యమైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం హ్యాపీ బర్త్‌డే. మత్తువదలరా చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన రితేష్‌రానా, తన రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 15న ఈ చిత్రం విడుదల […]

vennela kishore
X

ఇటీవల వినూత్నమైన పోస్టర్స్‌తో.. వైవిధ్యమైన టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం హ్యాపీ బర్త్‌డే. మత్తువదలరా చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన రితేష్‌రానా, తన రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రబృందం తాజాగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

ఈ ప్రచార చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్రను ఉద్దేశించి పేరు రితిక్‌సోది… ఓవర్గానికి విరోధి.. అంటూ వాయిస్‌ఓవర్‌లో వచ్చే సంభాషణలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. రెండు చేతుల్లో రెండు గన్స్‌తో వెన్నెలకిషోర్ ఈ ప్రచార చిత్రంలో కనిపిస్తున్నాడు. నైటీ వేసిన నాటి ఫెలో అంటూ ఆ పాత్రను ఉద్దేశించి ఉపయోగించిన డైలాగ్స్ ఇలా.. అన్ని చూస్తుంటే రితిక్‌సోది పాత్రలో వెన్నెల కిషోర్ పాత్ర నవ్వులు పూయించడం ఖాయంలా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో వెన్నెలకిషోర్ సెంట్రల్ మినిస్టర్‌గా గన్‌బిల్లును ఆమోదించడం.. గన్‌పాలసీని ప్రతిపాదించడం, ఇవన్నీ పూర్తి కామెడీ ప్రధానంగా ఉండబోతున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

First Published:  16 Jun 2022 9:19 PM GMT
Next Story