Telugu Global
NEWS

ఆ పరిస్థితి వస్తే కేంద్రం బలగాలను పంపకుండా ఉంటుందా?

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో కీలకమైన రైల్వేస్టేషన్ వద్దకు అంత మంది వచ్చి విధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. విధ్వంసమే పరిష్కారం అయితే ఇక ప్రపంచమే ఉండదన్నారు. రైల్వే పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించే అవకాశం ఉండదని, ఇది పూర్తి రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతల అంశమని.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. […]

kishan-reddy-sec-railway-station
X

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానిలో కీలకమైన రైల్వేస్టేషన్ వద్దకు అంత మంది వచ్చి విధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. విధ్వంసమే పరిష్కారం అయితే ఇక ప్రపంచమే ఉండదన్నారు. రైల్వే పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించే అవకాశం ఉండదని, ఇది పూర్తి రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతల అంశమని.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజాఆస్తులను కాపాడడం కర్తవ్యమని.. అలా కాకుండా చేతులెత్తేసి చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరిగితే సీఆర్‌పీఎఫ్‌, రాపిడ్ యాక్షన్‌ ఫోర్స్‌ను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని.. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది కాబట్టి తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పబోదు కదా అని ప్రశ్నించారు.

నిన్న కూడా రాజ్‌భవన్‌ ముందు గొడవ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించకుండా ఉండిపోయిందన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనేదే అయినా.. శాంతిభద్రతలను కాపాడాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. నిన్న, ఈరోజు జరిగిన సంఘటనల ఆధారంగా తెలంగాణలోని మేధావులు, ప్రజలే దీనికి కారణం ఎవరు అన్నది ఆలోచించుకోవాలన్నారు. ఒకవైపు రైల్వే స్టేషన్లో విధ్వంసం జరుగుతుంటే… రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాఆస్తులను ధ్వంసం చేయడం, ప్రయాణికులపై దాడులు చేయడం నిరసన తెలిపే విధానం కాదన్నారు కిషన్ రెడ్డి.

First Published:  17 Jun 2022 10:02 AM GMT
Next Story