Telugu Global
National

చ‌ర్చిలో కాల్పులు ఇద్ద‌రు మృతి

అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ వెర్రిత‌ల‌లు వేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఓ మూల తుపాకుల మోత‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అమాయ‌కుల ప్రాణాలు హ‌రిస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం సాయంత్రం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలోకి ఆగంతకుడు ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ దారుణం జ‌రిగింది. సమాచారం అందుకున్న […]

two-people-have-been-killed-in-a-shooting-at-st-stephens-episcopal-church-in-westavia-hills-alabama
X

అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ వెర్రిత‌ల‌లు వేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఓ మూల తుపాకుల మోత‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అమాయ‌కుల ప్రాణాలు హ‌రిస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం సాయంత్రం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలోకి ఆగంతకుడు ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ దారుణం జ‌రిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. బఫెలో సూపర్‌మార్కెట్‌లో జాత్యహంకార దాడిలో ఒక శ్వేత జాతీయ సాయుధుడు 10 మంది నల్లజాతీయులను కాల్చి చంపాడు.

First Published:  17 Jun 2022 2:15 AM GMT
Next Story