Telugu Global
MOVIE UPDATES

మరోసారి రేట్లు తగ్గించిన ‘మేజర్’

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్, మహేష్ బాబు నిర్మించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. మేజర్ చిత్రానికి అన్ని వర్గాల […]

major
X

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్, మహేష్ బాబు నిర్మించారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

మేజర్ చిత్రానికి అన్ని వర్గాల నుండి గొప్ప ఆదరణ వచ్చింది. అలాగే స్కూల్ పిల్లలకు మేజర్ చిత్రం ఎంతగానో నచ్చింది. మేజర్ చిత్రం చూసిన విద్యార్ధులు చిత్ర యూనిట్ కు ప్రత్యేక సందేశాలు పంపిస్తున్నారు. ‘మేజర్ సందీప్ జీవితం తమకు ఎంతగానో ప్రేరణ కలిగించిదని తామూ మేజర్ సందీప్ లా ఆర్మీలో చేరి దేశం కోసం పోరాడతామని” విద్యార్ధులు, కథానాయకుడు అడివి శేష్ తో పాటు చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మేజర్ చిత్ర యూనిట్ స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి గ్రూప్ బుకింగ్స్ లో మేజర్ టికెట్ ధర 50 శాతం తగ్గించి చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు.

”పిల్లలకు మేజర్ ఇంతలా నచ్చుతుందని తెలియదు. మరింతమంది పిల్లలు మేజర్ సందీప్ జీవితాన్ని చూసి ప్రేరణ పొందాలి. ఇంకెంతో మంది పిల్లలు మేజర్ సందీప్ అవ్వాలనుకోవాలి. అందుకే మేజర్ చిత్ర యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి గ్రూప్ బుకింగ్స్ లో టికెట్ ధర 50 శాతం తగ్గించి పిల్లలకు ఆఫర్ చేయాలని నిర్ణయించాం. దీని లక్ష్యం ఒక్కటే. రేపటి భవిష్యత్ కి మేజర్ సందీప్ కథ తెలియాలి, మేజర్ సందీప్ గురించి చెప్పాలనేదే మా ఉద్దేశం. majorscreening@gmail.com ఈమెయిల్అడ్రస్ కి మీ స్కూల్ తరుపున ఒక ఈమెయిల్ పంపండి. టికెట్ ధర 50 శాతం తగ్గించి అ థియేటర్ లో మీకు, మీ పిల్లలకి మేజర్ సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. ఇదే సమయంలో కొన్ని ఎంపిక చేసిన స్కూల్స్ లో పిల్లలతో కలవడానికి నేను వస్తాను. మేజర్ సందీప్ గురించి ఇంకెన్నో విషయాలు పిల్లలతో పంచుకుంటాను.”

మేజర్ సినిమాను అన్ని వర్గాలకు దగ్గర చేసేందుకు ఇప్పటికే రేట్లు తగ్గించారు. ఇప్పుడు స్కూల్ విద్యార్థుల్ని కూడా ఆకట్టుకునేందుకు మరోసారి రేట్లను భారీగా తగ్గించారు.

First Published:  16 Jun 2022 9:21 PM GMT
Next Story