Telugu Global
MOVIE UPDATES

అఫీసియల్ : రజినీ కొత్త సినిమా ‘జైలర్’..!

వరుస పరాజయాలతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. తాజాగా ఆయన మరో సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సినిమా రానుంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేసి మేకర్స్ అభిమానులకు సప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్ సినిమాకు జైలర్ గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా […]

official-rajinis-new-movie-jailer
X

వరుస పరాజయాలతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. తాజాగా ఆయన మరో సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సినిమా రానుంది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేసి మేకర్స్ అభిమానులకు సప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్ సినిమాకు జైలర్ గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఈ లుక్ లో ఒక పొడవాటి కత్తిని వేలాడదీసి ఉన్నారు. దాని నిండా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి ఇది పక్కా మాస్ సినిమాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ జైలర్ గా నటించనున్నారు. రజినీ కి జోడిగా ఐశ్వర్య రాయ్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే వరుసగా ఏడు పరాజయాలు అందుకున్న రజినీకాంత్ కు జైలర్ మూవీ విజయం కీలకం కానుంది. జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.

First Published:  17 Jun 2022 1:53 AM GMT
Next Story