Telugu Global
NEWS

హైదరాబాద్ లో మెట్రో రైళ్లు బంద్.. ప్రయాణికుల అవస్థలు..

అగ్నిపథ్‌ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. ప్రధానంగా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని టార్గెట్ చేసినా.. ఆ ప్రభావం నగరం మొత్తం కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లు తగలబెట్టడం, పోలీసు కాల్పుల్లో ఒకరి దుర్మరణంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మూసి వేశారు. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. […]

హైదరాబాద్ లో మెట్రో రైళ్లు బంద్.. ప్రయాణికుల అవస్థలు..
X

అగ్నిపథ్‌ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. ప్రధానంగా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని టార్గెట్ చేసినా.. ఆ ప్రభావం నగరం మొత్తం కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లు తగలబెట్టడం, పోలీసు కాల్పుల్లో ఒకరి దుర్మరణంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మూసి వేశారు. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అన్ని రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. ఎంఎంటీఎస్‌ సర్వీసులనుకూడా నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించారు. స్టేషన్ కు రావాల్సిన ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. దూర ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. బస్సులను ఆశ్రయిస్తున్నారు.

నగరంలో ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లపై ఆధారపడిన ఉద్యోగులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు బయలుదేరే సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నానికి అల్లకల్లోలం జరిగి రైళ్లు రద్దయ్యాయి. దీంతో డ్యూటీలనుంచి తిరిగి వచ్చే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

రద్దు ఎప్పటివరకు..

ఒక్క సికింద్రాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు అగ్నిపథ్ కి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడంతో.. ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. ఈ రద్దు ఎప్పటి వరకు ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో రైళ్లు కూడా రద్దు చేశామని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మెట్రో సర్వీసులు ప్రారంభం కావని స్పష్టం చేశారు అధికారులు. ప్రయాణికులు ఎవరూ మెట్రో స్టేషన్లకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

First Published:  17 Jun 2022 4:46 AM GMT
Next Story