Telugu Global
MOVIE UPDATES

ప్రభాస్ తో డార్లింగ్, బుజ్జిగాడు టైపు సినిమా

ప్రభాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి తొలిసారిగా స్పందించాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తో సినిమాను కన్ ఫర్మ్ చేసిన ఈ దర్శకుడు.. అతడితో డార్లింగ్, బుజ్జిగాడు టైపు మూవీ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రభాస్ అంటే మారుతికి చాలా ఇష్టం అంట. మరీ ముఖ్యంగా డార్లింగ్, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పాత్రలంటే చాలా ఇష్టం అంట. అందుకే తన కొత్త సినిమాలో ప్రభాస్ ను యాక్టివ్ రోల్ లో చూపిస్తానంటున్నాడు మారుతి. ఈమధ్య కాలంలో ప్రభాస్, తన […]

prabhas hindi tamil language
X

ప్రభాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి తొలిసారిగా స్పందించాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తో సినిమాను కన్ ఫర్మ్ చేసిన ఈ దర్శకుడు.. అతడితో డార్లింగ్, బుజ్జిగాడు టైపు మూవీ చేయబోతున్నట్టు తెలిపాడు.

ప్రభాస్ అంటే మారుతికి చాలా ఇష్టం అంట. మరీ ముఖ్యంగా డార్లింగ్, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పాత్రలంటే చాలా ఇష్టం అంట. అందుకే తన కొత్త సినిమాలో ప్రభాస్ ను యాక్టివ్ రోల్ లో చూపిస్తానంటున్నాడు మారుతి. ఈమధ్య కాలంలో ప్రభాస్, తన సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదని.. తన సినిమాతో డార్లింగ్ నాటి రోజుల్ని గుర్తుచేస్తానని చెబుతున్నాడు.

ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా పని మీద ఉన్నాడు మారుతి. ఆ సినిమా రిలీజైన తర్వాత ప్రభాస్ సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి ప్రభాస్ తో చర్చలు మాత్రమే సాగుతున్నాయని, కథపై ఇంకా ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదని అంటున్నాడు.

అటు ప్రభాస్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్-కె సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత స్పిరిట్ అనే మరో సినిమా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లోనే మారుతితో సినిమా ఉంటుంది.

First Published:  16 Jun 2022 9:26 PM GMT
Next Story