Telugu Global
National

హెలీకాప్టర్ కొనుక్కోవాలి.. రూ. 6.65 కోట్లు లోన్ కావాలంటూ రైతు దరఖాస్తు

మహారాష్ట్ర గోరేగావ్‌లోని ఓ బ్యాంకుకు లోన్ అప్లికేషన్ వచ్చింది. అందులో రూ. 6.65 కోట్ల లోన్ కావాలని ఒక రైతు దరఖాస్తు చేసుకున్నాడు. అంతే కాదు.. ఆ డబ్బుతో ఏం చేయనున్నాడో కూడా వివరంగా రాశాడు. లోన్ ఇస్తే ఒక హెలికాప్టర్ కొని, అద్దెకు నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో బ్యాంకు అధికారులు ఆశ్చర్యపోయారు. అసలు ఒక రైతు ఎందుకు ఇలాంటి దరఖాస్తు పెట్టాడని ఆరా తీయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హింగోలికి చెందిన కైలాస్ […]

farmer-applies-Rs-6.6-crore-loan-for-helicopter
X

మహారాష్ట్ర గోరేగావ్‌లోని ఓ బ్యాంకుకు లోన్ అప్లికేషన్ వచ్చింది. అందులో రూ. 6.65 కోట్ల లోన్ కావాలని ఒక రైతు దరఖాస్తు చేసుకున్నాడు. అంతే కాదు.. ఆ డబ్బుతో ఏం చేయనున్నాడో కూడా వివరంగా రాశాడు. లోన్ ఇస్తే ఒక హెలికాప్టర్ కొని, అద్దెకు నడపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో బ్యాంకు అధికారులు ఆశ్చర్యపోయారు. అసలు ఒక రైతు ఎందుకు ఇలాంటి దరఖాస్తు పెట్టాడని ఆరా తీయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హింగోలికి చెందిన కైలాస్ పతంగే (22) అనే యువ రైతుకు రెండు ఎకరాల పొలం ఉన్నది. అందులోనే అతడు వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం అప్పు తెచ్చిన డబ్బుతో పంట వేసినా.. వర్షాలు సరిగా పడని కారణంగా నష్టాలు వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్లుగా సోయాబీన్ పండించినా.. వర్షాభావ పరిస్థితుల కారణంగా పెట్టుబడి కూడా రాలేదన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన పంట నష్టం బీమా కూడా సరిపోలేదని మొరపెట్టుకున్నాడు.

వ్యవసాయం చేయడం వల్ల నష్టమే కాని, లాభం లేదని.. ఇన్నాళ్లుగా పడిన కష్టం చాలని పతంగే అంటున్నాడు. మంచి జీవితం కొనసాగించేందుకే హెలికాప్టర్ కొనాలని నిర్ణయించానని.. దాన్ని బాడుగకు తిప్పి డబ్బులు సంపాదిస్తానని చెప్పాడు. నేనేం దాన్ని సొంతానికి వాడుకోనని.. కిరాయికి తిప్పి కిస్తీలు కడతానని చెప్పుకొచ్చాడు. కేవలం పెద్ద వాళ్లకే కలలు ఉండాలా? రైతులు కలలు కనకూడదా అని ప్రశ్నిస్తున్నాడు.

వేరే వ్యాపారాల కోసం దరఖాస్తు చేస్తే లోన్ వస్తుంది. అయితే వాటిలో చాలా పోటీ ఉంటుంది. అదే హెలికాప్టర్ రెంటల్‌కి అయితే పెద్దగా పోటీ ఉండదనే ఈ రంగాన్ని ఎంచుకున్నానని కైలాస్ పతంగే చెప్తున్నాడు. కాగా, ఆ దరఖాస్తుపై బ్యాంకు అధికారులు ఇంకా స్పందిచలేదని అతడు చెప్తున్నాడు.

First Published:  17 Jun 2022 9:01 AM GMT
Next Story