Telugu Global
NEWS

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి, 13 మందికి గాయాలు

కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా అగ్గి రాజేసింది. నిర‌స‌న‌ల మంట‌ల్లో ప‌లు రైళ్ళు ద‌గ్ధ‌మై రైల్వేకు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. సికింద్రాబాద్ స్టేష‌న్‌కు సుమారు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నాలు తెలుపుతున్నాయి. స్టేష‌న్ ప్రాంగ‌ణం, ప‌రిస‌రాల‌న్నీ ర‌క్త‌సిక్త‌మ‌య్యాయి. ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వ్వ‌డంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పులో ఒక యువ‌కుడు మర‌ణించ‌గా, డ‌జ‌న్ మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా […]

damodara-rakesh-killed-at-violence-in-secunderabad-railway-station-agnipath-protest
X

కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా అగ్గి రాజేసింది. నిర‌స‌న‌ల మంట‌ల్లో ప‌లు రైళ్ళు ద‌గ్ధ‌మై రైల్వేకు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. సికింద్రాబాద్ స్టేష‌న్‌కు సుమారు రూ.20 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్టు ప్రాథ‌మిక అంచ‌నాలు తెలుపుతున్నాయి. స్టేష‌న్ ప్రాంగ‌ణం, ప‌రిస‌రాల‌న్నీ ర‌క్త‌సిక్త‌మ‌య్యాయి. ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వ్వ‌డంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పులో ఒక యువ‌కుడు మర‌ణించ‌గా, డ‌జ‌న్ మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా ఆస్ప‌త్రి వ‌ద్ద ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ ను మోహ‌రించారు.

ఇదిలా ఉండ‌గా నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌దిమందితో కూడిన బృందం వ‌స్తే చ‌ర్చ‌లు జ‌రుపుదామ‌ని ఆహ్వానించారు. మూడేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ను నిలిపివేశారు. శ‌రీర దారుఢ్య ప‌రీక్ష‌లు పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు ఎంతో కాలంగా ప‌రీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ప‌రీక్ష నిర్వ‌హించ‌క‌పోగా ఉన్న‌ట్టుండి వాటన్నింటినీ ర‌ద్దు చేసి అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. దీంతో ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారంతా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే.

వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి
కాగా శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద పోలీసులు జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ జిల్లా డ‌బీర్బెల్ గ్రామానికి చెందిన దామ‌ర కుమార‌స్వామి కుమారుడు రాకేష్(18) మ‌ర‌ణించాడు. అత‌నికి ఛాతీలో బుల్లెట్ దిగ‌డంతో హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లింగగా అప్ప‌టికే ఆ యువ‌కుడు మృతిచెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. రాకేష్ సోద‌రి రాణి బీఎస్ఎఫ్ లో జ‌వాన్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె స్ఫూర్తితోనే రాకేష్ కూడా ఆర్మీ ట్రైనింగ్ పొందాడు.

గాయపడిన వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి..
కర్నూలు జిల్లా మంత్రాల‌యానికి చెందిన జ‌గ‌న్నాథ రంగ‌స్వామి (20), ఫోన్ నెంబ‌ర్ 7997445866.
క‌రీంన‌గ‌ర్ జిల్లా చింత‌కుంట గ్రామానికి చెందిన మ‌ల్ల‌య్య కుమారుడు కె.రాకేష్(20), ఫోన్ : 7095040926
మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ గ్రామానికి చెంద‌ని తిరుమ‌ల‌య్య కుమారుడు జె.శ్రీకాంత్ (20),
వరంగల్ జిల్లాకు చెందిన శంక‌ర్ కుమారుడు ఎ. కుమార్‌(21), ఫోన్ -9581354671,
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కు చెందిన శంక‌ర్ కుమారుడు ప‌ర‌శురామ్‌(23),
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, కు చెందిన నాగ‌య్య కుమారుడు పి.మోహ‌న్‌(20) కు బుల్లెట్ గాయాల‌య్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన నాగేంద‌ర్ బాబు(21). వీరితో పాటు లక్ష్మారెడ్డి , వినయ్, విద్యాసాగర్, చంద్రు, దామెర కరేశ్, దండు మహేష్, జగన్నాథ్ లు కూడా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వీరంతా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

First Published:  17 Jun 2022 7:08 AM GMT
Next Story