Telugu Global
National

ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కోవిడ్ పాజిటివ్ కి గురైన ఆమె దీనికి సంబంధించిన ఇతర రుగ్మతలతో రెండు రోజుల క్రితమే ఈ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 75 ఏళ్ళ సోనియా ముక్కు నుంచి రక్తం కారడం ఆరంభమైందని. వెంటనే ఆమెకు ఫాలో అప్ చికిత్సలు చేస్తున్నారన్న కాంగ్రెస్ అధికారిక […]

congress-president-sonia-gandhi-currently-treated-for-fungal-infection
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కోవిడ్ పాజిటివ్ కి గురైన ఆమె దీనికి సంబంధించిన ఇతర రుగ్మతలతో రెండు రోజుల క్రితమే ఈ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 75 ఏళ్ళ సోనియా ముక్కు నుంచి రక్తం కారడం ఆరంభమైందని.

వెంటనే ఆమెకు ఫాలో అప్ చికిత్సలు చేస్తున్నారన్న కాంగ్రెస్ అధికారిక ప్రకటనను పార్టీ నేత జైరాం రమేష్ షేర్ చేశారు. సోనియా దిగువ శ్వాస నాళంలో (రెస్పిరేటరీ ట్రాక్ట్) ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు డాక్టర్లు కనుగొన్నారని ఆయన వెల్లడించారు. దీనితో బాటు కోవిడ్ అనంతర రుగ్మతలకు ఆమె చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ఆమె మరికొన్ని రోజులపాటు డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 12 న సోనియా ఈ ఆసుపత్రిలో చేరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు తనను విచారిస్తున్నప్పటికీ ఆమె తనయుడు, పార్టీ నేత రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు గంగారాం ఆసుపత్రికి వెళ్తూ ఆమెను పరామర్శిస్తున్నారు. ఈ కేసులో రాహుల్ విచారణ, పాలక బీజేపీ అనుసరిస్తున్న విధానం కారణంగా పార్టీ ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భంలో సోనియా ఆసుపత్రి పాలు కావడం గమనార్హం. వరుసగా మూడు రోజులపాటు రాహుల్ ఈడీ విచారణకు హాజరయ్యారు.

నేడు కూడా ఆయనను విచారించవలసి ఉండగా.. దీనిని ఈ నెల 20 వరకు వాయిదా వేయాలని ఆయన ఈడీని కోరారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించారు. సోనియా కూడా ఈ నెల 23 న ఈడీ ఎదుట హాజరు కావలసి ఉంది.

రాహుల్ తో బాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా గంగారాం ఆసుపత్రిని సందర్శిస్తూ తల్లిని పరామర్శిస్తున్నారని, తరచూ తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా ఈ ఆసుపత్రిని విజిట్ చేస్తుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. హృద్రోగ నిపుణుడు డా. అరూప్ బసు .. పర్యవేక్షణలో సోనియాకు అన్ని చికిత్సలు జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

First Published:  17 Jun 2022 2:59 AM GMT
Next Story