Telugu Global
National

కాంగ్రెస్ సిఎం సోద‌రుడి ఇంటిపై సిబిఐ దాడులు.. క‌క్ష సాధింపేనంటూ బిజెపి పై ఆగ్ర‌హం

ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌ల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయించ‌డం కేంద్ర ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింద‌ని విప‌క్ష పార్టీలు బిజెపి పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్తిన ప్ర‌తీవారిని ల‌క్ష్యంగా చేసుకుని వేధించ‌డ‌మే గాక అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం, రాజ‌కీయ నేత‌ల‌పై సిబిఐ, ఈడి వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొలుపుతూ దాడులు చేయిస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపించే కొద్దీ ఈ త‌ర‌హా దాడులు మ‌రింత పెర‌గొచ్చ‌ని ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు […]

cbi-raids-congress-cms-brothers-house
X

ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌ల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయించ‌డం కేంద్ర ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింద‌ని విప‌క్ష పార్టీలు బిజెపి పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్తిన ప్ర‌తీవారిని ల‌క్ష్యంగా చేసుకుని వేధించ‌డ‌మే గాక అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం, రాజ‌కీయ నేత‌ల‌పై సిబిఐ, ఈడి వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొలుపుతూ దాడులు చేయిస్తోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

ఎన్నిక‌లు స‌మీపించే కొద్దీ ఈ త‌ర‌హా దాడులు మ‌రింత పెర‌గొచ్చ‌ని ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు వారు ఏడేళ్ల నాడు ముగిసిన నేష‌న‌ల్ హెరాల్డ్ కేసును తిర‌గ‌దోడి త‌మ అగ్ర‌నేత రాహుల్ గాంధీని విచార‌ణ పేరుతో విధిస్తున్నార‌ని ఉద‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.

ఈ స‌మ‌యంలోనే దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ నివాసంపై శుక్ర‌వారంనాడు సీబీఐ దాడులు చేసింది. ఆయ‌న‌పై సిబిఐ అవినీతి కేసు నమోదు చేసింది. జోధ్ పూర్ లోని ఆయన నివాసంతో పాటు పలు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఒక ఫర్టిలైజర్ ఎక్స్ పోర్ట్ కేసులో అగ్రసేన్ గెహ్లాట్ ఇప్పటికే ఈడీ నిఘాలో ఉన్నారు. 2007 – 2009 మధ్యలో భారీ ఎత్తున ఎరువుల‌ను అక్ర‌మంగా ఎగుమతి చేశారంటూ ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టింది. మనీ లాండరింగ్ చట్టం కింద అగ్రసేన్, ఆయన సంస్థ అనుపమ్ కృషి, మరి కొందరిపై విచారణ జరుపుతోంది.

మరోవైపు సీబీఐ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సీబీఐ చేత దాడులు చేయిస్తోందని బీజేపీపై మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో త‌మ‌పార్టీ నేత‌ల‌ను మోడి ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా చేసుకుంటూ వేధింపుల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

First Published:  17 Jun 2022 3:54 AM GMT
Next Story