Telugu Global
NEWS

ప్రతి తరగతి గదిలో టీవీ, బైజూస్‌తో ఏపీ ఒప్పందం

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఎడ్యుకేషనల్‌ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీందర్‌ అమెరికా నుంచి వర్చువల్‌ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో విద్యను అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా సన్నద్దం […]

AP-Govt-MoU-Byjus
X

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఎడ్యుకేషనల్‌ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీందర్‌ అమెరికా నుంచి వర్చువల్‌ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో విద్యను అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా సన్నద్దం చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర విద్యారంగంలో ఇదో గొప్ప కార్యక్రమమన్నారు. దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు ఎడ్యుటెక్ విద్య అందుతుందన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు బైజూస్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌తో పార్యపుస్తకాలు అందిస్తామన్నారు. తెలుగు- ఇంగ్లీష్ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలవుతుందన్నారు. 500 కోట్ల రూపాయలతో 4.7 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని ప్రకటించారు.

ప్రతి ఏటా 8వ తరగతిలోకి విద్యార్థులు రాగానే ఈ ట్యాబ్‌లు అందజేస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి ట్యాబ్‌లు అందజేయనున్నట్టు సీఎం చెప్పారు. నాడు-నేడులో భాగంగా ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేలా పిల్లలను తీర్చిదిద్దేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు.

First Published:  16 Jun 2022 5:13 AM GMT
Next Story