Telugu Global
MOVIE UPDATES

వీకెండ్ రిలీజ్.. ఈ వారం 4 సినిమాలు

మొన్నటివరకు వారానికి ఒక పెద్ద సినిమా రిలీజైంది. ఎఫ్3తో పెద్ద సినిమాల కోటా ముగిసింది. దీంతో మీడియం రేంజ్, స్మాల్ బడ్జెట్ సినిమాలు క్యూ కట్టాయి. వారానికి 2-3 సినిమాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ వారాంతం ఏకంగా 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమా విరాటపర్వం. రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దాదాపు మూడేళ్లుగా నలుగుతోంది. ఎట్టకేలకు రేపు విడుదలవుతోంది. రానా ఇందులో నక్సలైట్ రవన్నపాత్రలో […]

weekend Movies
X

మొన్నటివరకు వారానికి ఒక పెద్ద సినిమా రిలీజైంది. ఎఫ్3తో పెద్ద సినిమాల కోటా ముగిసింది. దీంతో మీడియం రేంజ్, స్మాల్ బడ్జెట్ సినిమాలు క్యూ కట్టాయి. వారానికి 2-3 సినిమాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ వారాంతం ఏకంగా 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమా విరాటపర్వం.

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దాదాపు మూడేళ్లుగా నలుగుతోంది. ఎట్టకేలకు రేపు విడుదలవుతోంది. రానా ఇందులో నక్సలైట్ రవన్నపాత్రలో కనిపించనున్నాడు. సాయిపల్లవి వెన్నెల పాత్రలో నటించింది. బంధాలు, బంధుత్వాలకు దూరంగా అడవిలో జీవించే రవన్నను, వెన్నెల ప్రేమిస్తుంది. వీళ్ల ప్రేమ ఏ తీరం చేరుకుంది? వెన్నెల రాకతో రవన్న జీవితం ఎలా మారిందనేది ఈ విరాటపర్వం. ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రియమణి, నివేత పెతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

ఇక విరాటపర్వంతో పాటు వస్తున్న మరో మూవీ గాడ్సే. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. గోపీగణేష్ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో సత్యదేవ్-గోపి కాంబోలో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గాడ్సేపై అంచనాలు పెరిగాయి. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది.

ఈ సినిమాలతో పాటు మొనగాడు, కిరోసిన్ అనే మరో 2 చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో ఏ మూవీ క్లిక్ అవుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక ఈ సినిమాల రాకతో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఎఫ్3 లాంటి సినిమాలకు థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

First Published:  16 Jun 2022 5:33 AM GMT
Next Story