Telugu Global
NEWS

ఈ ఫుడ్ కాంబినేషన్స్ ఎంతో డేంజర్!

ఒక్కో ఆహారానికి ఒక్కోరకమైన లక్షణాలుంటాయి. భిన్నమైన స్వభావాలు కలిగి ఉండే కొన్నిరకాల ఫుడ్స్‌ను కలిపి తినడం ద్వారా అనారోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో విరుద్ధంగా పని చేసే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ వల్ల కడుపులో వికారం, అజీర్తి లాంటి సమస్యలొస్తాయి. అందుకే కొన్ని కాంబినేషన్స్‌ను అవాయిడ్ చేయాలి. అవేంటంటే.. హై ప్రొటీన్స్ ప్రోటీన్స్‌ను అరిగించడం కూడా పొట్టకు కాస్త కష్టమే. ఏవైనా రెండు రకాల హై ప్రోటీన్ ఫుడ్స్‌ను కలిపి తీసుకోవడం ద్వారా పొట్టలో ప్రొటీన్ డోస్ […]

Very-Dangerous-Food-Combinations
X

ఒక్కో ఆహారానికి ఒక్కోరకమైన లక్షణాలుంటాయి. భిన్నమైన స్వభావాలు కలిగి ఉండే కొన్నిరకాల ఫుడ్స్‌ను కలిపి తినడం ద్వారా అనారోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో విరుద్ధంగా పని చేసే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ వల్ల కడుపులో వికారం, అజీర్తి లాంటి సమస్యలొస్తాయి. అందుకే కొన్ని కాంబినేషన్స్‌ను అవాయిడ్ చేయాలి. అవేంటంటే..

హై ప్రొటీన్స్

ప్రోటీన్స్‌ను అరిగించడం కూడా పొట్టకు కాస్త కష్టమే. ఏవైనా రెండు రకాల హై ప్రోటీన్ ఫుడ్స్‌ను కలిపి తీసుకోవడం ద్వారా పొట్టలో ప్రొటీన్ డోస్ ఎక్కువవుతుంది. తద్వారా తిన్నది అరగడానికి సమయం పడుతుంది. శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే రెండు రకాల హై ప్రోటీన్ ఫుడ్స్‌ను కలిపి తీసుకోకూడదు.

తేనె, నెయ్యి

విరుద్ధమైన లక్షణాలుండే తేనే, నెయ్యి పదార్థాలను కలిపి కానీ, వెంటవెంటనే తీసుకోవడం ద్వారా కడుపులో వికారం లాంటి సమస్యలు మొదలయ్యే అవకాశముంది.

పాలు, ఆకుకూరలు

తేలికగా అరిగే ఆకుకూరలను, అరగడానికి టైం పట్టే పాలతో కలిపి తీసుకోవడం ద్వారా కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ రెండు ఫుడ్స్‌ను కలిపి తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలొచ్చే అవకాశం ఉంది.

చీజ్, కూల్‌డ్రింక్

పిజ్జా, బర్గర్, బిర్యానీ లాంటి ఫ్యాటీ ఫుడ్స్ తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగే అలవాటుంటుంది చాలామందికి. కానీ ఫ్యాట్స్ తో పాటుగా కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల కడుపునొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వచ్చే అవకాశముందని డాక్టర్లు సూచిస్తున్నారు.

పాలు, పండ్లు

కడుపులో పాలు లేదా పాల పదార్థాలు అరగడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే వీటితో పాటుగా తేలికగా అరిగే పండ్లు తీసుకోవడం వల్ల కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో పాటు పండ్లలోని పోషకాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే పాలతో పాటు సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరిగే అవకాశముంది.

First Published:  16 Jun 2022 4:38 AM GMT
Next Story