Telugu Global
National

పోలీసులు నా దుస్తులు చించేశారు -మహిళా ఎంపీ ఆరోపణ‌

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ గంటల‌ తరబడి విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంంగా నిరసనప్రదర్శన‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదర్శనకారులపై పోలీసులు విరుచుకపడుతున్నారు. పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకపోయి మరీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. మహిళల పట్ల కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తన దుస్తులు చించేశారని ఒక మహిళా ఎంపీ ఆరోపించారు. తమిళనాడులోని కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి […]

congress mp
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ గంటల‌ తరబడి విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంంగా నిరసనప్రదర్శన‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదర్శనకారులపై పోలీసులు విరుచుకపడుతున్నారు. పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకపోయి మరీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. మహిళల పట్ల కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తన దుస్తులు చించేశారని ఒక మహిళా ఎంపీ ఆరోపించారు.

తమిళనాడులోని కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఢిల్లీలో సాగుతున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. అయితే నిన్న పోలీసులు తన‌పై దారుణంగా దాడి చేశారని, దుస్తులు చించేశారని ఆమె ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

జ్యోతిమణి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు శశి థరూర్ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

” ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దారుణమైన సంఘటన‌. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం భారతీయ మర్యాదకు భంగం కలిగించడమే, నేను ఢిల్లీ పోలీసుల‌ ప్రవర్తనను ఖండిస్తున్నాను. వాళ్ళనుండి జవాబుదారీ తనం ఆశిస్తున్నాను. ఈ సంఘటనపై స్పీకర్ ఓంబిర్ల దయచేసి చర్యలు తీసుకోండి!’’ అని థరూర్ట్వీట్ చేశారు.

ఢిల్లీ పోలీసు సిబ్బంది తన బట్టలు చింపి, ఇతర మహిళా నిరసనకారులతో కలిపి బస్సులో నేరస్థులుగా మమ్ములను తీసుకెళ్లారని ఎంపీ జోతిమణి తన వీడియోలో ఆరోపించారు. వీడియోలో ఆమె తన చిరిగిన కుర్తాను చూపిస్తూ…”ఢిల్లీ పోలీసులు నిన్న మాపై దారుణంగా దాడి చేశారు. వారు నా బట్టలు చింపారు, నా బూట్లు తొలగించి, నేరస్థురాలిలా నన్ను తీసుకెళ్లారు” అని ఆమె చెప్పింది.

తమకు పోలీసులు కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారని ఆమె ఆరోపించారు. తాము దాహంతో ఇబ్బంది పడ్డామని, నీళ్ళు కావాలంటూ పోలీసులను అనేకసార్లు అడిగామని ఆమె చెప్పారు. పైగా తాము నీళ్ళు కొనడానికి షాపు వద్దకు వెళ్తే నీళ్ళు ఇవ్వద్దంటూ దుకాణదారులను పోలీసులు బెధిరించారని ఆమె ఆరోపించారు.

పార్టీ ప్రధాన కార్యాలయం, ఈడీ కార్యాలయం వెలుపల పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా నిరసనకారులను ఈడ్చుకెళ్లి బస్సుల్లో ఎక్కిస్తున్న‌ వీడియోను కూడా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కూడా పోలీసులు చొరబడ్డారని, అక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారని కెసి వేణుగోపాల్, భూపేష్ బాఘేల్, రణదీప్ సూర్జేవాలా సహా పార్టీ అగ్రనేతలు చెప్పారు. అయితే కాంగ్రెస్ వాదనలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.

Next Story