Telugu Global
MOVIE UPDATES

సాయిపల్లవికి హ్యాండ్ ఇచ్చిన రామ్ చరణ్

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేశారు. లెక్కప్రకారం ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వెంకటేష్, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సి ఉంది. కానీ వెంకీ మాత్రమే వచ్చాడు. రామ్ చరణ్ రాలేదు. రామ్ చరణ్ వస్తాడనుకొని చాలామంది మెగాఫ్యాన్స్ ఈ ఫంక్షన్ కు వచ్చారు. చరణ్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. కానీ ఈవెంట్ లో చరణ్ మాత్రం […]

virata parvam
X

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేశారు. లెక్కప్రకారం ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వెంకటేష్, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సి ఉంది. కానీ వెంకీ మాత్రమే వచ్చాడు. రామ్ చరణ్ రాలేదు.

రామ్ చరణ్ వస్తాడనుకొని చాలామంది మెగాఫ్యాన్స్ ఈ ఫంక్షన్ కు వచ్చారు. చరణ్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. కానీ ఈవెంట్ లో చరణ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై రానా స్పందించాడు.

లెక్కప్రకారం, విరాటపర్వం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చరణ్ రావాల్సి ఉందట. వస్తానని చరణ్ మాట కూడా ఇచ్చాడట. కానీ ఆఖరి నిమిషంలో ఫ్లయిట్ మిస్ అవ్వడంతో, ఫంక్షన్ కు రాలేకపోయాడట. ఈ విషయాన్ని రానా స్వయంగా బయటపెట్టాడు. ఈవెంట్ కు వచ్చిన ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పాడు.

వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది విరాటపర్వం. 90ల్లో తెలంగాణలో జరిగిన నక్సల్స్ పోరాటం నేపథ్యంలో అల్లుకున్న అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో ఎక్కువ భాగం సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ సినిమాకు హీరో సాయిపల్లవి అని స్వయంగా ప్రకటించాడు రానా.

First Published:  16 Jun 2022 5:00 AM GMT
Next Story