Telugu Global
International

రష్యన్ స్టార్ కు అమెరికా ఊరట యూఎస్ ఓపెన్ కు చాంపియన్ మెద్వదేవ్

న్యూయార్క్ వేదికగా ఆగస్టు 29 నుంచి జరిగే 2022 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో రష్యా, బైలో రష్యా క్రీడాకారులను అనుమతించాలని అమెరికన్ ఓపెన్ టెన్నిస్ సమాఖ్య నిర్ణయించింది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యన్, దానికి మద్దతుగా నిలిచిన బైలోరష్యన్ క్రీడాకారులపై వింబుల్డన్ నిర్వాహకులు నిషేధం విధించిన నేపథ్యంలో.. అమెరికన్ టెన్నిస్ సమాఖ్య ఈ సంచలన నిర్ణయం తీసుకోడం విశేషం. క్రీడలతో రాజకీయాలా? పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను […]

రష్యన్ స్టార్ కు అమెరికా ఊరట యూఎస్ ఓపెన్ కు చాంపియన్ మెద్వదేవ్
X

న్యూయార్క్ వేదికగా ఆగస్టు 29 నుంచి జరిగే 2022 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో రష్యా, బైలో రష్యా క్రీడాకారులను అనుమతించాలని అమెరికన్ ఓపెన్ టెన్నిస్ సమాఖ్య నిర్ణయించింది.
ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యన్, దానికి మద్దతుగా నిలిచిన బైలోరష్యన్ క్రీడాకారులపై వింబుల్డన్ నిర్వాహకులు నిషేధం విధించిన నేపథ్యంలో.. అమెరికన్ టెన్నిస్ సమాఖ్య ఈ సంచలన నిర్ణయం తీసుకోడం విశేషం.

క్రీడలతో రాజకీయాలా?

పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను అమెరికా, దాని మిత్రదేశాలు గ్రేట్ బ్రిటన్ నిరసిస్తూ పలు రకాలుగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీనిని క్రీడారంగానికి సైతం వర్తింప చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో రష్యన్ క్రీడాకారులు పాల్గొనకుండా నిషేధం అమలు చేస్తున్నాయి.

లండన్ వేదికగా ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనకుండా రష్యా, బైలో రష్యా క్రీడాకారులపై నిషేధం విధించారు.

అయితే…ఇంగ్లండ్ తో కలసి పరోక్షంగా రష్యాతో పోరాడుతున్న అమెరికా మాత్రం తమ దేశం వేదికగా జరిగే యూఎస్ ఓపెన్ టో్ర్నీలో బైలో రష్యా, రష్యన్ క్రీడాకారులను అనుమతించాలని నిర్ణయించడం ద్వారా సంచలనం సృష్టించింది.

ఇటీవలే పారిస్ వేదికగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల విభాగాలలో పాల్గొనటానికి రష్యన్, బైలో రష్యన్ క్రీడాకారులకు ఫ్రాన్స్ అనుమతి నిచ్చింది. వింబుల్డన్ నిర్వాహక సంఘం నిషేధం విధించినా అమెరికా మాత్రం దానికి భిన్నమైన నిర్ణయమే తీసుకొంది.

తటస్థ పతాకంతో…

ప్రభుత్వ అధినేతలు తీసుకొన్న నిర్ణయాలకు క్రీడాకారులను బలిచేయటం తగదని, రష్యా, బైలో రష్యా క్రీడాకారులు తమ దేశం తరపున కాకుండా..తటస్థపతాకంతో.. యూఎస్ ఓపెన్లో పాల్గొనవచ్చుననీ యూఎస్ టెన్నిస్ సంఘం సీఈవో లీయూ షెర్ ప్రకటించారు.

గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ లో రష్యన్ సూపర్ స్టార్ డేనియల్ మెద్వదేవ్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్ లో మెద్వదేవ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలవనున్నాడు.

అగ్రశ్రేణి క్రీడాకారుల అసంతృప్తి…

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు బైలో రష్యన్ క్రీడాకారుల పై వింబుల్డన్‌ నిర్వాహకులు విధించిన నిషేధంపై నిరసన వెల్లువెత్తుతోంది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లో రష్యా, బెలారస్‌కు చెందిన క్రీడాకారులు పాల్గొనకుండా సస్పెన్షన్‌ విధించడంపై టెన్నిస్‌ దిగ్గజాలు రాఫెల్ నడాల్‌, నోవాక్‌ జొకోవిచ్‌ తమ గళం విప్పారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ రష్యన్ క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు.

వీరిద్దరికి తోడు ఏటీపీ, డబ్ల్యూటీఏ సైతం..ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ప్రతినిధుల తీరుపట్ల పెదవి విరిచింది. నిషేధం నిర్ణయంతో రష్యాకు చెందిన ప్రపంచ నంబర్‌టూ ప్లేయర్‌ డేనియల్ మెద్వదెవ్‌తో పాటు అండ్రె రుబ్లెవ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ అనస్తియా పవ్లుచెంకోవా, విక్టోరియా అజరెంకా(బెలారస్‌) వింబుల్డన్‌లో ఆడేది అనుమానంగా మారింది. జూన్‌ 27 నుంచి వింబుల్డన్ ప్రారంభంకానుంది.

First Published:  16 Jun 2022 1:30 AM GMT
Next Story