Telugu Global
MOVIE UPDATES

పవన్ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ..!

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ మూవీగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తమిళ వినోదాయచిత్తం రీమేక్ తో […]

PK - Ketika
X

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడిక్ మూవీగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తమిళ వినోదాయచిత్తం రీమేక్ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించాల్సి ఉంది.

అయితే ఈ రెండు సినిమాల్లో ముందుగా వినోదాయచిత్తం రీమేక్ మొదలవుతుందని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ముఖ్య పాత్ర పోషించిన సముద్రఖనినే రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. వినోదాయచిత్తంలో సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సముద్రఖని దేవుడి పాత్రలో కనిపించగా, చనిపోయి పైలోకానికి వెళ్లే పాత్రలో తంబి రామయ్య నటించాడు.

తమిళంలో సముద్రఖని చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్, తంబి రామయ్య చేసిన పాత్రను సాయి ధరమ్ తేజ్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ కావడంతో పవన్ కళ్యాణ్ కు 20 రోజులు డేట్స్ సరిపోతాయట. అందుకే పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా కంటే ముందుగా ఈ సినిమాను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన రొమాంటిక్, లక్ష్య సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ నటిస్తోందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. కాగా కేతిక శర్మ మరో మెగా హీరో, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సినిమా రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  16 Jun 2022 5:26 AM GMT
Next Story