Telugu Global
National

అదాని సైలెంట్… ప్రధాని సైలెంట్.. -కేటీఆర్ సెటైర్లు

కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 10లక్షల ఉద్యోగాల గురించి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు శ్రీలంక ఉదంతంపై మరోసారి ప్రధానిని టార్గెట్ చేశారు. శ్రీలంకలో విండ్ పవర్ కాంట్రాక్ట్ ల విషయంలో ఆ దేశాధ్యక్షుడు గొటబాయపై మోదీ ఒత్తిడి తెచ్చారనే వార్త ఇటీవల సంచలనంగా మారింది. పారిశ్రామికవేత్త అదానీకి విండ్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేలా చేసేందుకు నరేంద్రమోదీ ఒత్తిడి తెచ్చారని సాక్షాత్తూ సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు […]

అదాని సైలెంట్… ప్రధాని సైలెంట్.. -కేటీఆర్ సెటైర్లు
X

కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 10లక్షల ఉద్యోగాల గురించి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు శ్రీలంక ఉదంతంపై మరోసారి ప్రధానిని టార్గెట్ చేశారు. శ్రీలంకలో విండ్ పవర్ కాంట్రాక్ట్ ల విషయంలో ఆ దేశాధ్యక్షుడు గొటబాయపై మోదీ ఒత్తిడి తెచ్చారనే వార్త ఇటీవల సంచలనంగా మారింది. పారిశ్రామికవేత్త అదానీకి విండ్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేలా చేసేందుకు నరేంద్రమోదీ ఒత్తిడి తెచ్చారని సాక్షాత్తూ సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్‌ ఫెర్డినాండో పార్లమెంట్ కమిటీ ముందు ఒప్పుకున్నారు. కేవలం భారత ప్రధాని మోదీ వల్లే ఆ ప్రాజెక్ట్ అదానీ సంస్థకు దఖలుపడిందనేది వారి ఆరోపణ. అలా ఆ ప్రాజెక్ట్ ని దక్కించుకున్న అదానీ, ఇప్పుడు రెట్టింపు రేట్లకు అక్కడ విద్యుత్ ని అమ్ముతున్నారు. దీంతో అక్కడి విద్యుత్ ఉద్యోగులు అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ప్రస్తుతం భారత్ లో ఈడీ, సీబీఐ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేతలు అవినీతికి పాల్పడ్డారా, లేక అధికార పార్టీయే వారిని టార్గెట్ చేసిందా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిపై వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాయకులపై ఉంది. శ్రీలంక కుంభకోణంలో ప్రధాని మోదీ, అదానీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చేసింది కూడా చిన్నా చితకా వ్యక్తులు కాదు. శ్రీలంక ఉన్నతాధికారులు. మరి దీనిపై ప్రధాని స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. కనీసం అదానీ అయినా, ప్రధాని అయినా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారాయన.

శ్రీలంకలోని మన్నార్‌లో 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్లాంటు విషయంలో పీపీఏ పద్ధతిలో 25 సంవత్సరాలకు సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ)తో అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. యూనిట్‌ విద్యుత్ 6.50 అమెరికన్‌ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా అంగీకరించి, ఆ తర్వాత రేటు 7.55 సెంట్లకు పెంచారు. ఇతర కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే కేవలం 4 సెంట్లకే యూనిట్ విద్యుత్ దొరికేది. అదానీకి ఇవ్వడం వల్ల శ్రీలంకకు వేలకోట్ల నష్టం వచ్చింది. దీనికి పరోక్ష కారణం భారత ప్రధాని అని తేలింది. ఇంత దుమారం రేగినా కూడా ప్రధాని కార్యాలయం కానీ, బీజేపీ నేతలు కానీ స్పందించకపోవడం గమనార్హం. పొరుగు దేశాలకు నాలుగు వ్యాక్సిన్ పార్శిళ్లు పంపిస్తేనే గొప్పగా ప్రచారం చేసుకునే బీజేపీ, పొరుగున ఉన్న శ్రీలంకలో ప్రధాని మోదీపై ఈ స్థాయిలో విమర్శలు వస్తే తేలుకుట్టిన దొంగలా ఉండటం ఇక్కడ విశేషం.

First Published:  16 Jun 2022 2:36 AM GMT
Next Story