Telugu Global
NEWS

ఆరోగ్యానికి ఫ్యాట్స్ కూడా ముఖ్యమే!

ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి హాని మాత్రమే జరుగుతుందనుకుంటారు చాలామంది. కానీ వాస్తవానికి మంచి కొవ్వుల వల్లనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులను ఎలా ఎంచుకోవాలంటే.. కొవ్వుల్లో చాలారకాలున్నాయి. ఇందులో కొన్ని ఆరోగ్యానికి అత్యవసరమైనవైతే.. మరికొన్ని గుండెకు హాని చేసేవి. అందుకే ఏవి ఎలాంటి ఫ్యాట్స్ అనేది తెలుసుకుని ఎంచుకోవాలి. ఫ్యాట్స్‌లో.. మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచ్యురేటెడ్, శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనే నాలుగు రకాలున్నాయి. మోనో అన్‌శాచురేటెడ్‌ మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌.. […]

Healthy-Fats
X

ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి హాని మాత్రమే జరుగుతుందనుకుంటారు చాలామంది. కానీ వాస్తవానికి మంచి కొవ్వుల వల్లనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులను ఎలా ఎంచుకోవాలంటే..

కొవ్వుల్లో చాలారకాలున్నాయి. ఇందులో కొన్ని ఆరోగ్యానికి అత్యవసరమైనవైతే.. మరికొన్ని గుండెకు హాని చేసేవి. అందుకే ఏవి ఎలాంటి ఫ్యాట్స్ అనేది తెలుసుకుని ఎంచుకోవాలి. ఫ్యాట్స్‌లో.. మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచ్యురేటెడ్, శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనే నాలుగు రకాలున్నాయి.

మోనో అన్‌శాచురేటెడ్‌

మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌.. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివి. బాదం నూనె, ఆలివ్‌ నూనె, నువ్వుల నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి.

పాలీ అన్‌శాచురేటెడ్

పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. సన్‌ఫ్లవర్, వేరుశనగతోపాటు, అవకాడో, వాల్నట్స్ వంటి నూనెల్లో పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి.

శాచురేటెడ్

ఇకపోతే శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఆరోగ్యానికి కొంత నష్టం జరుగుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వులు ఇవే. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి, డాల్డా, చీజ్, జంతు సంబంధిత నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

చేపలు, సోయాబీన్స్, అవిసె గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌.. పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వుల కిందకు వస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచూ తీసుకోవడం అవసరం.

ట్రాన్స్‌ఫ్యాట్స్

కొవ్వుల్లో అన్నింటికంటే ప్రమాదకరమైనవి ట్రాన్స్‌ఫ్యాట్స్. వీటి వల్ల ఎలాంటి లాభం లేకపోగా.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతుంది. పిజ్జా, బర్గర్, బేక్డ్ ఫుడ్స్, స్విట్స్ లాంటి వాటిలో ఇలాంటి ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.

First Published:  16 Jun 2022 4:25 AM GMT
Next Story