Telugu Global
NEWS

టెన్త్ విద్యార్థులకు బెటర్మెంట్.. ఎంతమందికి ఉపయోగం..?

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో పాస్ పర్సంటేజీ మరీ తక్కువగా ఉండటంతో.. ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారికి కంపార్ట్ మెంటల్ గ్రేడ్ ఇవ్వబోమని భరోసా ఇచ్చింది. అదే సమయంలో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు బెటర్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కండిషన్స్ అప్లై.. బెటర్మెంట్ అంటున్నారు కానీ ఇక్కడ కండిషన్లు చాలానే […]

Tenth-Students-Betterment-Exams-Ap
X

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో పాస్ పర్సంటేజీ మరీ తక్కువగా ఉండటంతో.. ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారికి కంపార్ట్ మెంటల్ గ్రేడ్ ఇవ్వబోమని భరోసా ఇచ్చింది. అదే సమయంలో మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు బెటర్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కండిషన్స్ అప్లై..

బెటర్మెంట్ అంటున్నారు కానీ ఇక్కడ కండిషన్లు చాలానే ఉన్నాయి. 49.. లేదా అంతకంటే తక్కువ మార్కులు వచ్చినవారికే బెటర్మెంట్ అవకాశం. కేవలం రెండు సబ్జెక్ట్ లలో మాత్రమే బెటర్మెంట్ రాసే అవకాశం ఉంది. పరీక్ష ఫీజు పేపర్ కి రూ.500. ఈ ఏడాది పరీక్షలు రాసినవారికి మాత్రమే అవకాశం.

ఎంతమందికి ఉపయోగం..?

బెటర్మెంట్ పేరుతో మార్కులు తక్కువవచ్చినవారికి ఉపయోగపడే కార్యక్రమం ఇది అంటూ ప్రభుత్వం ప్రకటించినా.. విద్యార్థులో ఎంతమందికి ఇది ఉపయోగపడుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. పాస్ పర్సంటేజీ ఈసారి బాగా తక్కువగా ఉంది. 67.72 శాతం మంది మాత్రమే పాసయ్యారు. మిగతా 32.28 శాతం మంది సప్లిమెంటరీ రాస్తున్నారు. పాసైనవారిలో చాలామందికి మంచి మార్కులొచ్చాయి. పాసైనవారు అందులోనూ 49 కంటే తక్కువ మార్కులు వచ్చినవారి శాతం తక్కువ. దాదాపుగా అలాంటి వారంతా హమ్మయ్య.. పాసయ్యాం అనే ఫీలింగ్ లో ఉంటారు కానీ.. మార్కులు పెంచుకోవాలనే ఉద్దేశం వారికి ఉండకపోవచ్చు. అందులోనూ కేవలం రెండు సబ్జెక్ట్ లకే బెటర్మెంట్ అనే అవకాశమిచ్చారు. సహజంగా బాగా చదివి పరీక్షలు రాసినవారు, ఒకటీ రెండు మార్కులు పెంచుకోవడం కోసం కూడా బెటర్మెంట్ రాస్తుంటారు. మార్కుల నిబంధన పెట్టడంతో ఈసారి క్లవర్ స్టూడెంట్స్ ఎవరూ బెటర్మెంట్ రాయలేరు. 49కంటే తక్కువ వచ్చినవారు రాయాలనుకోరు. దీంతో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి పెడుతున్న బెటర్మెంట్ పరీక్షలు ఎంతమందికి ఉపయోగం అనే ప్రశ్న తలెత్తుతోంది.

First Published:  16 Jun 2022 9:12 AM GMT
Next Story