Telugu Global
National

ఓట్ల కోసం చీప్ ట్రిక్స్…. బస్సులకు కాషాయ రంగు

భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తుందన్న విమర్షలు విపక్షాలు చేస్తూనే ఉంటాయి. అయితే విపక్షాల విమర్షలు నిజమే అని బీజేపీ పదే పదే నిరూపిస్తూనే ఉంటుంది. ఎక్కడ స్విచ్చు నొక్కితే ఎక్కడ బల్బ్ వెలుగుతుందో ఆ పార్టీకి తెలిసినంతగా ఈ దేశంలో మరే పార్టీకి తెలియక పోవచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు మిగతా పార్టీలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ఆర్థికాభివృద్ది, విద్యా, వైద్యం తదితర సమస్యల గురించి మాట్లాడితే బీజేపీ మాత్రం […]

ఓట్ల కోసం చీప్ ట్రిక్స్….  బస్సులకు కాషాయ రంగు
X

భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తుందన్న విమర్షలు విపక్షాలు చేస్తూనే ఉంటాయి. అయితే విపక్షాల విమర్షలు నిజమే అని బీజేపీ పదే పదే నిరూపిస్తూనే ఉంటుంది. ఎక్కడ స్విచ్చు నొక్కితే ఎక్కడ బల్బ్ వెలుగుతుందో ఆ పార్టీకి తెలిసినంతగా ఈ దేశంలో మరే పార్టీకి తెలియక పోవచ్చు.

ఎన్నికలు వచ్చినప్పుడు మిగతా పార్టీలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ఆర్థికాభివృద్ది, విద్యా, వైద్యం తదితర సమస్యల గురించి మాట్లాడితే బీజేపీ మాత్రం రామాలయం , జ్ఞానవాపి మసీదు, శ్రీకృష్ణ జన్మస్థలం, హిజబ్, ఆవు మాంసం, భాగ్యలక్ష్మి టెంపుల్, మసీదుల కూల్చివేత, పాకిస్తాన్, చైనా తదితర విషయాలు మాట్లాడుతుంది.

అంతేనా…? ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి కొద్ది ముందు సడెన్ గా మతకలహాలు రేగుతాయి. కేంద్రంలో ఎన్నికలనగానే సరిహద్దుల్లో పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు రాగానే కర్నాటకలో హిజబ్ వివాదాస్పదమవుతుంది. ఇలా ఎన్నని చెప్పుకుంటాం కానీ ప్రస్తుతం గుజరాత్ లో అలాంటి ఎత్తుగడలే మొదలైనాయి.

ఈ ఏడాది డిశంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక అక్కడ అప్పుడే ఎత్తుగడలు మొదలయ్యాయి. GSRTC (గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) బస్సులన్నింటికీ కాషాయ‌ రంగు వేయాలని నిర్ణయించి అప్పుడే పనులు కూడా మొదలుపెట్టింది. ఆగస్టు మొదటి వారం నుంచి కాషాయ బస్సులు ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానున్నాయి.

ఈ చర్యపై కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది హిందుత్వాన్ని ప్రజలపై రుద్దే ఎన్నికల ఎత్తుగడ అని ఆరోపించింది.
కాంగ్రెస్ నాయకుడు హేమంగ్ రావల్ మాట్లాడుతూ, “బిజెపి బస్సులకు కాషాయ రంగు వేసి ఎన్నికల్లో హిందుత్వ కార్డును వాడటానికి ప్రయత్నిస్తోంది, ముందు బిజెపి ప్రభుత్వం RTC కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి. గుజరాత్ లోని అనేక గ్రామాలకు ఇప్పటికీ బస్సులే లేవు. ముందుగా అన్ని గ్రామాలకు బస్సు కనెక్టివిటీని కల్పించాలి. ” అని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ దోషి మాట్లాడుతూ, “ప్రధాని మోదీ కార్యక్రమాలకు గుజరాత్‌లోని RTC బస్సులను ఉపయోగిస్తున్నారు. ఇటీవల నవ్‌సారిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, గుజరాత్ నలుమూలల నుండి వేలాది RTC బస్సులను ఉపయోగించారు. దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోతారు ?
గుజరాత్‌లో RTC బస్సు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.” అని ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను GSRTC అధికారులు ఖండించారు. బస్సులకు కాషాయ రంగు వేయడానికి రాజకీయాలకు సంబంధమే లేదని ఆర్‌టిసి అధికారి కె డి దేశాయ్ అన్నారు. ”మేము 300 స్లీపర్ బస్సులకు , 500 డీలక్స్ బస్సులకు, 200 సాధారణ బస్సులకు కాషాయ రంగులు వేయాలని నిర్ణయించాం. పని ప్రారంభించాం. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో కాషాయ బస్సులు రోడ్డెక్కుతాయి. అంతకు ముందే ఓ మినీ బస్సుకు కాషాయ రంగు వేశాము. ఈ రంగులుమార్చడానికి ఎన్నికలతో సంబంధం లేదు.” అని ఆయన అన్నారు.

అయితే అధికారులు ఎక్కడైనా ఇలా కాకుండా మరోలా మాట్లాడతారా ? ఎన్నికల్లో లబ్ధి కోసమే బస్సులకు కాషాయరంగు వేశామని ఏ అధికారైనా చెబుతారా ? చెప్తే ఆ అధికారి పదవిలో ఉంటారా ? అధికారులేం చెప్పినా ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ బ్రాండ్ కలర్ గా మార్చుకున్న కాషాయాన్ని బస్సులకు వేయడం ఎందుకో ప్రజలకు అర్దం కాదా ?

First Published:  16 Jun 2022 2:32 AM GMT
Next Story