Telugu Global
NEWS

రాజమండ్రి టీడీపీలో బుచ్చయ్యకు మరో ఝలక్..

ఆమధ్య ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత బుజ్జగింపుల ఎపిసోడ్.. ఆ వెంటనే ఆయన వెనక్కి తగ్గడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య టీడీపీని వీడిపోతారంటే ఎవరూ నమ్మలేదు కానీ, అప్పట్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే ఇప్పుడు అలాంటి సీన్ మరోసారి రిపీటయ్యేలా ఉంది. ఎందుకంటే.. రాజమండ్రి టీడీపీలో బుచ్చయ్యకు మరోసారి షాకిచ్చారు అదే పార్టీ నేత ఆదిరెడ్డి వాసు. […]

Rajamandry-TDP-Bucchaiah-Aadireddy-vasu
X

ఆమధ్య ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత బుజ్జగింపుల ఎపిసోడ్.. ఆ వెంటనే ఆయన వెనక్కి తగ్గడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య టీడీపీని వీడిపోతారంటే ఎవరూ నమ్మలేదు కానీ, అప్పట్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే ఇప్పుడు అలాంటి సీన్ మరోసారి రిపీటయ్యేలా ఉంది. ఎందుకంటే.. రాజమండ్రి టీడీపీలో బుచ్చయ్యకు మరోసారి షాకిచ్చారు అదే పార్టీ నేత ఆదిరెడ్డి వాసు.

రాజమండ్రి ఒకే నియోజకవర్గంగా ఉన్నప్పుడు బుచ్చయ్య చౌదరి అక్కడినుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సిటీ, రూరల్ గా విడిపోయాక.. బుచ్చయ్యను రూరల్ కి పంపించారు చంద్రబాబు. వరుసగా రెండుసార్లు అక్కడ కూడా ఆయన గెలిచారు. అయితే సిటీలో ప్రస్తుతం టీడీపీ తరపున ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ రెండూ టీడీపీవే అయినా.. పార్టీలో సఖ్యత లేదు. సిటీపై తన పెత్తనం సాగడంలేదనే కారణంతో గతంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బెదిరించారు బుచ్చయ్య. ఇప్పుడు మరోసారి అలాంటి గొడవే మొదలైంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు.. వచ్చే ఎన్నికల్లో సిటీ సీటు నాదేనంటూ ముందే ప్రకటించారు.

రాజమండ్రి సిటీ నుంచి ఈసారి తాను టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆదిరెడ్డి వాసు. రాజమండ్రి టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈమేరకు ప్రకటించారు. గతంలో కొన్ని కారణాల వల్ల తన భార్యకు సీటు ఇచ్చారని, ఈసారి మాత్రం తానే పోటీ చేస్తానని చెప్పారు, ఈ విషయంలో తగ్గేది లేదని కూడా అన్నారాయన.

అధిష్టానం హామీ ఇచ్చిందా..?

చంద్రబాబు ఆశీస్సులున్నాయా.. లేక లోకేష్ తో స్నేహం ఉందో తెలియదు కానీ ఆదిరెడ్డి వాసు మాత్రం రాజమండ్రి సిటీ సీటు తనకు ఖాయమైపోయినట్టు ప్రకటించుకున్నారు. ఏకపక్షంగా ఆయన చేసిన ప్రకటనతో బుచ్చయ్య నొచ్చుకున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాను సిటీకి రావాలని, రూరల్ నుంచి తన మనిషిని గెలిపించుకోవాలనుకుంటున్నారు బుచ్చయ్య చౌదరి. ఆదిరెడ్డి ఫ్యామిలీని పక్కనపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు వారే కాస్త అడ్వాంటేజ్ తీసుకున్నారు. ముందుగానే సిటీ సీటుపై కుంపటి పెట్టారు. దీనిపై బుచ్చయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  15 Jun 2022 9:11 PM GMT
Next Story