Telugu Global
MOVIE UPDATES

స్వాతిముత్యం వచ్చేస్తున్నాడు

గణేష్ బెల్లంకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం‘. వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను తీర్చిదిద్దారు దర్శకుడు లక్ష్మణ్. […]

స్వాతిముత్యం వచ్చేస్తున్నాడు
X

గణేష్ బెల్లంకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం‘. వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను తీర్చిదిద్దారు దర్శకుడు లక్ష్మణ్.

దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

First Published:  15 Jun 2022 2:51 AM GMT
Next Story