Telugu Global
MOVIE UPDATES

డీజేగా మారిన అక్కినేని హీరో

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా “అహాం రీబూట్”. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం “అహం రీబూట్” సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) టీజర్ ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. కాన్సెప్ట్ ను తెలుసుకొని టీమ్ ని అభినందించాడు. […]

డీజేగా మారిన అక్కినేని హీరో
X

సుమంత్ హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా “అహాం రీబూట్”. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం “అహం రీబూట్” సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) టీజర్ ను హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. కాన్సెప్ట్ ను తెలుసుకొని టీమ్ ని అభినందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలై లో విడుదల కానుంది.

మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.. అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది. ఇందులో సుమంత్ ఆర్జే నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలయ్ కు ఫోన్ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు హీరో సాయాన్నిరేడియో ద్వారా కోరుతుంటారు.

మరి వాళ్లను హీరో ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా ఉండబోతోంది. ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక యునిక్ కాన్సెప్ట్ ను థ్రిల్లింగ్ గా ప్రజెంట్ చేయడం అహం రీబూట్ కి బలంగా మారుతుంది అని టీమ్ నమ్ముతుంది. హీరో సుమంత్ నటన ప్రత్యేకంగా ఉండబోతోంది.

First Published:  15 Jun 2022 11:10 AM GMT
Next Story