Telugu Global
MOVIE UPDATES

ధమాకా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా”. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల ఇందులో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాతలు. ఈ […]

sree leela
X

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా”. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల ఇందులో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ లో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో బ్యూటీఫుల్ గా ఉంది. ఉబెర్-కూల్ కాస్ట్యూమ్‌లో ప్లెజంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రణవి పాత్రలో అలరించనుంది శ్రీలీల.

‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

First Published:  15 Jun 2022 11:05 AM GMT
Next Story