Telugu Global
MOVIE UPDATES

వెన్నెల పాత్రపై సాయిపల్లవి రియాక్షన్

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. పేరుకు రానా ఇందులో హీరో అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది. ఈ విషయాన్ని యూనిట్ ఆల్రెడీ కన్ ఫర్మ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన సాయిపల్లవి, సినిమాలో తను పోషించిన వెన్నెల పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. “వెన్నెల చాలా నార్మల్ అమ్మాయి. దర్శకుడు వేణు చాలా అద్భుతంగా రాశారు. ఆయన అంత అద్భుతంగా రాయడం వలన నా పని సులువైంది. […]

sai pallavi
X

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. పేరుకు రానా ఇందులో హీరో అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది. ఈ విషయాన్ని యూనిట్ ఆల్రెడీ కన్ ఫర్మ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన సాయిపల్లవి, సినిమాలో తను పోషించిన వెన్నెల పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది.

“వెన్నెల చాలా నార్మల్ అమ్మాయి. దర్శకుడు వేణు చాలా అద్భుతంగా రాశారు. ఆయన అంత అద్భుతంగా రాయడం వలన నా పని సులువైంది. ఈ సినిమా ఒక ప్రయాణం. వెన్నెల పాత్రలో ఒక అమాయకత్వం ఉంటుంది. తను నమ్మేదాన్ని సాధించే తెగువ ఉంటుంది. ఆ పాత్రలో ఉన్న ఆ స్పిరిట్ నచ్చింది. ప్రతి ప్రేమలో కొత్తదనం ఉంటుంది. అందుకే వెన్నెల ప్రేమ కూడా నాకు కొత్తగా అనిపించింది. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్ పేపర్ కు అవే ఆన్సర్లు రాస్తూ ఉంటే కిక్ ఉండదు కదా. కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి ఉండాలి. ప్రతి పాత్రకి కొంత భాద, వత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది. వెన్నెల పాత్ర విషయంలో కూడా ఆ బాధ, ఒత్తిడికి లోనయ్యాను.”

ఇలా తన పాత్ర ఛాయలతో పాటు, తను ఎంత ఇబ్బంది పడిందో కూడా వివరించింది సాయిపల్లవి. మరోవైపు ఇందులో రానా పోషించిన పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చింది. రవన్న పాత్ర పోషించడానికి రానా లాంటి నటుడు మాత్రమే కావాలని, ఆ పాత్ర చేయడానికి రానా ఒప్పుకోవడం యూనిట్ చేసుకున్న అదృష్టం అని చెప్పుకొచ్చింది. రానా లాంటి నటుడు ఇలాంటి సినిమా చేయడం అతడి గొప్పదనం అంటోంది.

First Published:  15 Jun 2022 11:11 AM GMT
Next Story