Telugu Global
National

అభ్యర్థి తేలలేదు.. సారీ చెప్పేసిన 81 ఏళ్ల పవార్‌

విపక్షాల తరపున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. శరద్ పవార్‌ను ముందుకుతోయాలని చూసినా ఆయన తెలివిగా తప్పుకున్నారు. మమత నిర్వహించిన భేటీకి అనేక పక్షాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం తమ ప్రతినిధులను పంపించి సరిపెట్టాయి చాలా పార్టీలు. విపక్షాల్లో చాలా పార్టీలు శరద్ పవార్‌ అభ్యర్థిత్వమే మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు ఎంత వరకు సాధ్యం అన్న దానిపై […]

pposition-partys-meeting-chaired-by-bengal-cm-mamata-banerjee-for-the-selection-of-the-presidential-candidate-could-not-reach-a-decision
X

విపక్షాల తరపున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. శరద్ పవార్‌ను ముందుకుతోయాలని చూసినా ఆయన తెలివిగా తప్పుకున్నారు. మమత నిర్వహించిన భేటీకి అనేక పక్షాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం తమ ప్రతినిధులను పంపించి సరిపెట్టాయి చాలా పార్టీలు.

విపక్షాల్లో చాలా పార్టీలు శరద్ పవార్‌ అభ్యర్థిత్వమే మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు ఎంత వరకు సాధ్యం అన్న దానిపై ఎన్సీపీ అనుమానంతో ఉంది. నిలబడి ఓడితే అది శరద్ పవార్‌ ఖ్యాతిని దెబ్బతీస్తుందన్న ఆలోచనతో ఆ పార్టీ ఉంది. అందుకే పవార్ ఇంకా క్రీయశీల రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారంటూ పోటీకి ఆయన సిద్దంగా లేరని ఎన్సీపీ తేల్చేసింది.

81 ఏళ్ల పవార్ ఇంకా క్రీయాశీల రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారని ఎన్సీపీ చెబుతున్నా .. అసలు కారణం మాత్రం పోటీ చేసినా గెలుపు సాధ్యం కాదన్న భావనేనని చెబుతున్నారు. పెద్ద దిక్కుగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ సమావేశంతో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎవరి పేరును ప్రతిపాదించలేదని చెబుతున్నారు. మమత నిర్వహించిన సమావేశానికి ఆప్‌, బీజేడీ కూడా హాజరుకాలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నది తేలిన తర్వాతే తమ నిర్ణయానికి వెల్లడించాలని ఆప్‌ భావిస్తోంది.

అభ్యర్థిని తేల్చకుండానే సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. సమావేశం జరిగిన తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా శరద్‌ పవార్ పేరును ప్రతిపాదించాయన్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలబడేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని వివరించారు. విపక్షాలన్నీ ప్రస్తుతం ఏకతాటిపైనే ఉన్నాయన్నారు. దేశంలో బుల్డోజింగ్ ప్ర‌క్రియ కొనసాగుతోందని దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విపత్కర పరిస్థితుల్లో అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రతి వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మరోసారి సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు.

ఆహ్వానించినా వెళ్లేవాడిని కాదు- ఓవైసీ

అటు ఈ సమావేశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ తమను ఆహ్వానించలేదని, ఒక వేళ ఆహ్వానించినా ఆ సమావేశానికి తాము వెళ్లేవాళ్లం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఆహ్వానించారు కాబట్టే ఆ సమావేశానికి తాము హాజరుకాబోమని చెప్పి ఉండేవారమన్నారు. పైగా గతంలో తమ పార్టీని ఉద్దేశించి మమతా బెనర్జీ దారుణంగా మాట్లాడారని.. అలాంటి వ్యక్తి నిర్వహిస్తున్న సమావేశానికి తామెలా వెళ్తామని ఓవైసీ ప్రశ్నించారు. కొంతకాలంగా ఎంఐఎం .. బీజేపీకి టీ టీంలా పనిచేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి మేలు జరుగుతోందన్న అభిప్రాయం విపక్షాల్లో ఉంది. అందుకే ఎంఐఎంను విపక్షాల భేటీకి ఆహ్వానించలేదు.

First Published:  15 Jun 2022 7:28 AM GMT
Next Story