Telugu Global
NEWS

జూబ్లీహిల్స్ రేప్ కేసు:నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదు

జూబ్లీహిల్స్ అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసులో నిందితుల తల్లి‍తండ్రులు, ఇన్నోవా కారు డ్రైవర్ పైకూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరం జరిగినట్టు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన […]

jubilee hills
X

జూబ్లీహిల్స్ అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసులో నిందితుల తల్లి‍తండ్రులు, ఇన్నోవా కారు డ్రైవర్ పైకూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరం జరిగినట్టు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించిన పోలీసులు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు.

బాధితురాలిని తీసుకెళ్లిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ చైర్మన్ కారును డ్రైవర్‌కు అప్పగించారు. అతడు దానిని మెయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ చైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు.

మరోవైపు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే విషయం తెలిసిన సాదుద్దీన్, మిగతా ఐదుగురు మైనర్లు తలోదిక్కుకు పరారయ్యారు. ఓ నిందితుడు ఊటీలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాడు. మరో నిందితుడు నెల్లూరు దర్గాకు వెళ్లగా అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. మధ్యవర్తల ఆధారంగా మరో ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఎ-5 నిందితుడైన మరో మైనర్ గుల్బర్గా ప్రాంతంలో పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది.

First Published:  14 Jun 2022 9:17 PM GMT
Next Story