Telugu Global
National

ఆందోళన కలిగిస్తున్న వైరస్….దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మళ్ళీ కరోనా తరుముకొస్తోంది. రోజురోజుకూ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న 6,594 కోవిడ్ పాజిటీవ్ కేసులు రాగా నిన్న ఒక్క రోజు తేడాలో 33 శాతం అధికంగా 8,822 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఒక రోజులో 8,822 తాజా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదవడంతో, భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య బుధవారం 4,32,45,517 కు పెరిగింది, అయితే క్రియాశీల కేసుల సంఖ్య 53,637 కు […]

corona
X

దేశంలో మళ్ళీ కరోనా తరుముకొస్తోంది. రోజురోజుకూ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న 6,594 కోవిడ్ పాజిటీవ్ కేసులు రాగా నిన్న ఒక్క రోజు తేడాలో 33 శాతం అధికంగా 8,822 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. .

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఒక రోజులో 8,822 తాజా కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదవడంతో, భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య బుధవారం 4,32,45,517 కు పెరిగింది, అయితే క్రియాశీల కేసుల సంఖ్య 53,637 కు పెరిగింది. ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,24,792కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 15 మరణాలు నమోదయ్యాయని ఈ రోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన‌ డేటా పేర్కొంది. క్రియాశీల కేసుల సంఖ్య ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.12 శాతంగా ఉంది, అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఢిల్లీలో కోవిడ్ కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి, మంగళవారం 1,118 కేసులు నమోదయ్యాయి. మే 10 తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, కరోనాతోఇద్దరు మరణించారు.

ముంబైలో మంగళవారం 24 గంటల్లో 1,724 కోవిడ్ 19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోలిస్తే ఈ సంఖ్య 600 కి పైగా పెరిగింది. కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించారు.ముంబైలో కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వారి సంఖ్య 10,83,589 కు,కోవిడ్ -19 మరణాల సంఖ్య 19,575 కు చేరుకుంది.

First Published:  15 Jun 2022 12:43 AM GMT
Next Story