Telugu Global
MOVIE UPDATES

కరోనాను నేను సృష్టించలేదు – కరణ్ జొహర్

మే 25న బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు . ఆ పార్టీకీ బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, నీతూ కపూర్, అనన్య పాండే, రాణీ ముఖర్జీ, తమన్నా, పూజా హెగ్డే తదితరులతో పాటు రష్మిక, విజయ్ దేవరకొండలు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే షారుఖ్ ఖాన్, కత్రినా […]

కరోనాను నేను సృష్టించలేదు – కరణ్ జొహర్
X

మే 25న బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు . ఆ పార్టీకీ బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, నీతూ కపూర్, అనన్య పాండే, రాణీ ముఖర్జీ, తమన్నా, పూజా హెగ్డే తదితరులతో పాటు రష్మిక, విజయ్ దేవరకొండలు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి వారు కరోనా బారిన పడ్డారు.

ఈ నేపథ్యంలో కరణ్ జొహర్ బర్త్ డే పార్టి వల్లే కరోనా వ్యాపించిందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఈ వార్తలను ఖండించిన కరణ్ జొహర్ ఇటువంటి వార్తలను స్ప్రెడ్ చేయడం అన్యాయ‌మంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఎవరికి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ ప్రచారం మాత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన బర్త్ డే పార్టీ తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళవి ఎన్నో పెళ్లిళ్లు, షూటింగులు, ఫంక్షన్ల వంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయని… అటువంట‌ప్పుడు తానిచ్చిన బర్త్ డే పార్టీ వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కరోనాను తాను సృష్టించలేదని, తాను వ్యాప్తి చేయలేదని అన్నారు. తనకు సంబంధం లేని విషయం గురించి రాస్తూ… తనను ఎందుకు శిక్షిస్తున్నారని ప్రశ్నించారు.

Next Story