Telugu Global
MOVIE UPDATES

బ్రహ్మాస్త్రం తెలుగు ట్రయిలర్ రివ్యూ

రణబీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా.. భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్ ను ఈరోజు అధికారికంగా రిలీజ్ చేసారు. మెగాస్టార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. శివ అనే వ్యక్తి […]

brahbastra-telugu-trailer
X

రణబీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా.. భారీ పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్ ను ఈరోజు అధికారికంగా రిలీజ్ చేసారు. మెగాస్టార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. శివ అనే వ్యక్తి డీజేగా వర్క్ చేస్తుంటాడు. తనకు అతీత శక్తులున్నాయనే విషయాన్ని తెలుసుకుంటాడు. అగ్ని అతడ్ని ఏమీ చేయలేదు. పైగా నిప్పు అతడికి అదనపు శక్తి ఇస్తుంది. అలాంటి వ్యక్తి బ్రహ్మాస్త్రను ఎలా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు, చీకటి శక్తుల్ని ఎలా నాశనం చేశాడనేది ఈ సినిమా స్టోరీ.

ట్రయిలర్ లో గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల పాత్రలతో పాటు.. నాగార్జున, అమితాబ్ పాత్రలన్నింటినీ పరిచయం చేసిన విధానం బాగుంది. ట్రయాలజీలో మొదటి చిత్రంగా ఇది వస్తోంది.

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

ఇప్పటికే సౌత్ లో బ్రహ్మాస్త్రం ప్రమోషన్ ప్రారంభించారు. త్వరలోనే రెండో దశ ప్రచారం స్టార్ట్ చేస్తారు. సౌత్ కు సంబంధించి ప్రచార వ్యవహారాల్ని రాజమౌళి దగ్గరుండి చూసుకుంటున్నాడు.

First Published:  15 Jun 2022 2:56 AM GMT
Next Story