Telugu Global
NEWS

పెగాసస్ దొంగలను వదిలిపెట్టం.. హౌస్ కమిటీ చైర్మన్ భూమన

పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థులపై , ప్రజాసంఘాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థుల కదలికలను, వారి వ్యూహాలను పసిగట్టేవాడని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థులపై […]

pegasus-house-commite-ap
X

పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థులపై , ప్రజాసంఘాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థుల కదలికలను, వారి వ్యూహాలను పసిగట్టేవాడని ఆరోపణలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థులపై నిఘా ఉంచేందుకు పెగాసస్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హీట్ ఎక్కింది.

అనంతరం పెగాసస్ వ్యవహారం తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి, సభ్యులుగా కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాళి గిరిధర్‌ తదితరులను నియమించింది. అయితే ఈ కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పెగాసస్ వ్యవహారంపై కమిటీ విచారించింది.

అనంతరం చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెగాసస్ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ‘అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రజల సమాచారాన్ని సేకరించేందుకు పెగాసస్ ను తీసుకొచ్చాడు. ఈ విషయంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆరోపించింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ సాగుతోంది. ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించాం. వచ్చే సమావేశానికల్లా పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని భూమన పేర్కొన్నారు.

First Published:  15 Jun 2022 8:44 AM GMT
Next Story