Telugu Global
NEWS

కర్మఫలం అనుభవించాల్సిందే..

కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈడీ, సీబీఐ పేరుతో ఎంతోమందిని కేసుల్లో ఇరికించింది. మాట వినని వారిని దారికి తెచ్చుకోడానికి కేసులు పెట్టించింది, అన్యాయంగా అరెస్ట్ చేయించింది. అయితే ఆ పాపఫలితం ఎక్కడికీ పోలేదు. ఇప్పుడు అదే ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందా? ఈడీని ఉసిగొల్పిందా? అనే విషయాలు పక్కనపెడితే.. ఈడీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంక వెళ్లడం మాత్రం కచ్చితంగా కర్మ ఫలితమేనంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ […]

vijayasai-reddy
X

కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈడీ, సీబీఐ పేరుతో ఎంతోమందిని కేసుల్లో ఇరికించింది. మాట వినని వారిని దారికి తెచ్చుకోడానికి కేసులు పెట్టించింది, అన్యాయంగా అరెస్ట్ చేయించింది. అయితే ఆ పాపఫలితం ఎక్కడికీ పోలేదు. ఇప్పుడు అదే ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందా? ఈడీని ఉసిగొల్పిందా? అనే విషయాలు పక్కనపెడితే.. ఈడీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంక వెళ్లడం మాత్రం కచ్చితంగా కర్మ ఫలితమేనంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ దీన స్థితిపై ఆయన ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

వెన్నెముక లేదు.. పక్కటెముక కూడా లేదు..

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వెన్నెముక లేకుండా పోయిందని, జవసత్వాలు లేని పార్టీగా తయారైందని విమర్శించారు విజయసాయిరెడ్డి. వెన్నెముకే కాదు, ఆఖరికి పక్కటెముకలు కూడా ఆ పార్టీకి లేవన్నారు. ఆఖరికి ఆ పార్టీ 76 ఏళ్ల వృద్ధుడైన చిదంబరంపై ఆధారపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. చివరకు వీధుల్లో నిరసనలకోసం కూడా ఇలాంటి వృద్ధులే ఆ పార్టీకి దిక్కయ్యారని అన్నారు.

శిక్ష తప్పదు..

రాజకీయ కక్ష సాధింపులకోసం ఎంతోమందిని కాంగ్రెస్ పార్టీ వేధించింది, ఎన్నో కుటుంబాలను బాధించింది. ఆ కర్మ ఫలమంతా ఈరోజు ఆపార్టీ అనుభవిస్తోందని అన్నారు విజయసాయిరెడ్డి. ఆధునిక దోపిడీదారులంతా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని, కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరంటూ ట్వీట్ వేశారు.

పీపీఈ కిట్లే దిక్కు..

పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, గోవా.. ఎన్నికల్లా దారుణ పరాజయాల తర్వాత రాహుల్ గాంధీ ప్రజలకు తన మొహం కూడా చూపించలేకపోతున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. అందుకే ఈడీ ముందుకి వెళ్లేటప్పుడు కూడా ఆయన ఫేస్ మాస్క్ పెట్టుకున్నారని పరోక్షంగా సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని, అప్పుడు రాహుల్ తన మొహాన్ని మాస్క్ తో కవర్ చేసుకోలేరని, ఆయనకు పీపీఈ కిట్ అవసరమవుతుందని చెణుకులు విసిరారు. 2024 ఎన్నికల తర్వాత రాహుల్.. పీపీఈ కిట్ ధరించి జనంలోకి రావాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.

First Published:  14 Jun 2022 12:37 AM GMT
Next Story