Telugu Global
MOVIE UPDATES

సినిమా ఫ్లాప్ అయిందని డబ్బులు వద్దన్న సాయిపల్లవి

సినిమా విడుదలకు ముందే ఆర్టిస్టుల పారితోషికాలు సెటిల్ చేయాల్సి ఉంటుంది. అవి సెటిల్ అవ్వకపోతే సినిమా విడుదల నిలిచిపోతుంది. కానీ సాయి పల్లవి మాత్రం ఓ సినిమాకు డబ్బులు తీసుకోలేదట. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయితే, మిగతా డబ్బులు ఇవ్వొద్దని కూడా చెప్పిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. స్వయంగా సాయిపల్లవి ఈ విషయం చెప్పుకొచ్చింది. “పడి పడి లేచే మనసు అనే సినిమా చేశాను. ఆ సినిమాకు సంబంధించి నాకు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. […]

Sai Pallavi to turn choreographer
X

సినిమా విడుదలకు ముందే ఆర్టిస్టుల పారితోషికాలు సెటిల్ చేయాల్సి ఉంటుంది. అవి సెటిల్ అవ్వకపోతే సినిమా విడుదల నిలిచిపోతుంది. కానీ సాయి పల్లవి మాత్రం ఓ సినిమాకు డబ్బులు తీసుకోలేదట. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయితే, మిగతా డబ్బులు ఇవ్వొద్దని కూడా చెప్పిందట. తాజాగా ఈ విషయం బయటపడింది. స్వయంగా సాయిపల్లవి ఈ విషయం చెప్పుకొచ్చింది.

“పడి పడి లేచే మనసు అనే సినిమా చేశాను. ఆ సినిమాకు సంబంధించి నాకు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. అలానే మూవీ చేశాను. ఫుల్ పేమెంట్ ఇవ్వకుండానే సినిమా రిలీజ్ చేశారు. నేను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అది కాస్తా ఫెయిలైంది. దీంతో నాకు చాలా బాధేసింది. మిగతా డబ్బులు ఇవ్వొద్దని నిర్మాతకు చెప్పేశాను. కానీ నిర్మాత సుధాకర్ గారు, నాకు ఇవ్వాల్సిన ప్రతి రూపాయి మిస్ అవ్వకుండా పంపించారు.”

ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. కథ నచ్చినప్పుడు తను పారితోషికాన్ని పట్టించుకోనని తెలిపింది. పైగా తన పారితోషికం లెక్కలన్నీ తన తల్లి చూసుకుంటుందని, చివరికి షాపింగ్ చేసినా, ఓటీపీ అమ్మకు వెళ్తుందని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

తనది డబ్బున్న కుటుంబం కాదని, అలా అని డబ్బు కోసం వెదుక్కునే అవసరం కూడా ఎప్పుడూ రాలేదని సాయిపల్లవి తెలిపింది. తమకు ఏం కావాలో, అవన్నీ తల్లిదండ్రులు తమకు సమకూర్చి పెట్టారని చెప్పుకొచ్చింది.

First Published:  14 Jun 2022 6:40 AM GMT
Next Story