Telugu Global
MOVIE UPDATES

20 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్

సరిగ్గా ఇవాళ్టికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు నితిన్. అదేంటి.. నితిన్ వయసు అంత తక్కువేంటి అనుకోవద్దు. నితిన్ నటుడిగా జన్మించి ఇవాళ్టికి 20 ఏళ్లు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ బయటపెట్టాడు. తనకు ఇంత సినీ జీవితాన్నిచ్చిన తన తొలి దర్శకుడ్ని, ప్రేక్షకుల్ని గుర్తు చేసుకున్నాడు. కృతజ్ఞతలు తెలిపాడు. స్వయంగా ఓ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు. “ప్రియమైన మిత్రులారా.. 20 సంవత్సరాల క్రితం, నేను నా మొదటి చిత్రం జయంతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. […]

nithin
X

సరిగ్గా ఇవాళ్టికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు నితిన్. అదేంటి.. నితిన్ వయసు అంత తక్కువేంటి అనుకోవద్దు. నితిన్ నటుడిగా జన్మించి ఇవాళ్టికి 20 ఏళ్లు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ బయటపెట్టాడు. తనకు ఇంత సినీ జీవితాన్నిచ్చిన తన తొలి దర్శకుడ్ని, ప్రేక్షకుల్ని గుర్తు చేసుకున్నాడు. కృతజ్ఞతలు తెలిపాడు. స్వయంగా ఓ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు.

“ప్రియమైన మిత్రులారా..

20 సంవత్సరాల క్రితం, నేను నా మొదటి చిత్రం జయంతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ రోజు నా అనుభూతిని పదాల్లో వర్ణించలేను. కానీ ప్రయత్నిస్తాను. ముందుగా, నాలోని నటుడిని గుర్తించి, నాకు మొదటి బ్రేక్ ఇచ్చినందుకు తేజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

నేను పనిచేసిన ప్రతి సినిమా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. మీరంతా లేకుంటే ఈరోజు నేను లేను. ఈ అందమైన సినీ ప్రయాణానికి నేను కృతజ్ఞుడ్ని. నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. చివరగా నాకు అండగా నిలిచిన ప్రేక్షక లోకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రేమతో.. మీ నితిన్..”

ఇలా తన 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఈ నటుడు మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ఈ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు.

First Published:  14 Jun 2022 6:23 AM GMT
Next Story