Telugu Global
NEWS

ఎన్టీఆర్ కుమార్తెపై కొడాలి నాని విమర్శలు..

మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు కానీ, అదే పార్టీలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఆయన పల్లెత్తు మాట అనలేదు. నందమూరి కుటుంబంపై తనకు గౌరవం ఉందని ఆయన చాలా సార్లు బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. కానీ తొలిసారిగా ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరిపై సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. గుడివాడ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలందరికోసం ఆలోచించాలి కానీ, కేవలం 10మంది […]

kodali-nani
X

మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు కానీ, అదే పార్టీలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ ఆయన పల్లెత్తు మాట అనలేదు. నందమూరి కుటుంబంపై తనకు గౌరవం ఉందని ఆయన చాలా సార్లు బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. కానీ తొలిసారిగా ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరిపై సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. గుడివాడ అభివృద్ధిని ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెగా ప్రజలందరికోసం ఆలోచించాలి కానీ, కేవలం 10మంది బాగుకోసం.. పురంద్రీశ్వరి ఫ్లైఓవర్లకు అడ్డుపడ్డారని, బీజేపీ అధినాయకత్వానికి చెప్పి గుడివాడలో ఫ్లైఓవర్ల నిర్మాణం జరగకుండా మోకాలడ్డారని అన్నారు. గుడివాడలో ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభించకపోతే.. టెంట్ వేసి ఆందోళన చేపడతానన్నారు నాని.

అసలేం జరిగింది..?

గుడివాడ పట్టణం నుంచి రైల్వే లైన్ వెళ్తుంది. ప్రజలు రైల్వేలైన్ దాటాలంటే గేటు తీసే వరకు వేచి చూడాల్సిందే. పట్టణంలో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ఎంపీ బాలశౌరి లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. సీఎం జగన్ కూడా పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ విషయంలో అభ్యర్థనలు ఇచ్చారు. సాధారణ అనుమతులు రావడంతో ఈనెల 26న టెండర్ల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే అంతలోనే.. కేంద్రం వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీనికి కారణం పురంద్రీశ్వరి అంటూ ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి కొడాలి నాని.

ఫ్లైఓవర్లు నిర్మిస్తే.. అక్కడ ఉన్న షాపులు, పెట్రోల్ బంకుల యజమానులకు వ్యాపారం తగ్గిపోతుంది. దీంతో వారంతా వేరే ప్రాంతానికి తరలిపోవాల్సి ఉంటుంది. వారి తరపున వకాల్తా పుచ్చుకున్న పురంద్రీశ్వరి పెట్రోల్ బంకుల యజమానులకు నష్టం కలగకుండా ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని అంటున్నారు కొడాలి నాని. ఈమేరకు నితిన్ గడ్గరీకి పురంద్రీశ్వరి లేఖ రాశారని చెప్పారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ఈ విషయంలో ఆమెకు సహకరిస్తున్నారని, గుడివాడ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు కొడాలి నాని.

First Published:  13 Jun 2022 9:48 PM GMT
Next Story