Telugu Global
MOVIE UPDATES

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా అప్ డేట్స్

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమౌతున్నారు. ఈ సినిమాకు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే టైటిల్ పెట్టారు. కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. […]

kiran
X

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమౌతున్నారు. ఈ సినిమాకు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే టైటిల్ పెట్టారు. కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు.

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఈ సినిమాకి సంబందించిన రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం కిరణ్ చేతిలో ఈ సినిమాతో పాటు సమ్మతమే అనే సినిమా కూడా ఉంది. ఆ మూవీ రిలీజైన తర్వాత “నేను మీకు బాగా కావాల్సినవాడిని” సినిమా అప్ డేట్స్ బయటకొస్తాయి.

First Published:  14 Jun 2022 6:21 AM GMT
Next Story