Telugu Global
National

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి విలపించారు.. ఎందుకో తెలుసా ?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఇందుకు కారణం ఓ సినిమా అంటే ఆశ్చర్యం కలగక మానదు. కన్నడ మూవీ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన కొత్త సినిమా ‘777 చార్లీ’ చూసిన ఆయన తన కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఒక మనిషికి, ఆ వ్యక్తి ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. 5 భాషల్లో ఈ సినిమా ఈ నెల 10 న విడుదల కాగా […]

cm-basavaraj-bommai
X

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఇందుకు కారణం ఓ సినిమా అంటే ఆశ్చర్యం కలగక మానదు. కన్నడ మూవీ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన కొత్త సినిమా ‘777 చార్లీ’ చూసిన ఆయన తన కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఒక మనిషికి, ఆ వ్యక్తి ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా చూపించారు. 5 భాషల్లో ఈ సినిమా ఈ నెల 10 న విడుదల కాగా బొమ్మై.. దీన్ని నిన్న చూశారు. తమ కుటుంబం అత్యంత అభిమానంగా, అపురూపంగా పెంచుకున్న కుక్క స్మృతులు గుర్తుకు వచ్చి ఆయన చలించిపోయారు.

ఆ శునకం గత ఏడాది మరణించింది. 777 చార్లీ మూవీ అద్భుతంగా ఉందని, ప్రతివారూ ఈ సినిమా చూడాలని బొమ్మై కోరారు. దీనిమేకర్స్ ని అభినందించారు. శునకాల గురించి ఎన్నో చిత్రాలు వచ్చాయని, కానీ ఈ సినిమాలో ఎమోషన్లు, జంతువులకు, మనుషులకు మధ్య ఉన్న బాండ్ ని చక్కగా చూపారని ఆయన అన్నారు. ప్రతివారూ దీన్ని చూడాలని కోరుతున్నానని చెప్పారు. మనుషులపై జాగిలాల ప్రేమ స్వచ్ఛమైనదని, వాటి విశ్వాసం గురించి చెప్పజాలమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది వీరి కుక్క మరణించడంతో బొమ్మై కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.

కె. కనకరాజ్ దర్శకత్వం వహించిన ‘777 చార్లీ’ చిత్రం నిజానికి ఓ అడ్వెంచర్ కామెడీ డ్రామా..రక్షిత్ శెట్టి, సంగీతా సింగేరీ , రాజ్ బి. శెట్టి, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించారు. పెట్ డాగ్-దాని యజమాని మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రం హృద్యంగా చూపింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలయింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 27 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రంతో చివరకు తన అయిదేళ్ల శ్రమ ఫలించిందని దర్శకుడు కనకరాజ్ అన్నారు. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం బాక్సాఫీసు కలెక్షన్లను రాబడుతోందని కనకరాజ్ వెల్లడించారు.

First Published:  14 Jun 2022 3:06 AM GMT
Next Story