Telugu Global
NEWS

విశాఖను ఊపేస్తున్న టీ-20 ఫీవర్ భారత లక్కీగ్రౌండ్ డాక్టర్ వైఎస్ఆర్ స్టేడియం

2022 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆడుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు చవిచూసిన భారత్ తొలిగెలుపుకోసం తన లక్కీగ్రౌండ్ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వైపు చూస్తోంది. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సఫారీలకు చెలగాటం, ఆతిథ్య భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. హాటుకేకుల్లా విశాఖ టీ-20 టికెట్లు… భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడో టీ-20 మ్యాచ్ కు వేదికగా నిలిచిన విశాఖ […]

Dr.Ysr stadium
X

2022 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆడుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు చవిచూసిన భారత్ తొలిగెలుపుకోసం తన లక్కీగ్రౌండ్ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వైపు చూస్తోంది.

రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సఫారీలకు చెలగాటం, ఆతిథ్య భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

హాటుకేకుల్లా విశాఖ టీ-20 టికెట్లు…

భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడో టీ-20 మ్యాచ్ కు వేదికగా నిలిచిన విశాఖ స్టేడియం టికెట్లు..ఆన్ లైన్ ద్వారానే 80 శాతం విక్రమైనట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

స్టేడియం సామర్థ్యం 27వేల 251 కాగా…80 శాతం టికెట్లు ఆన్ లైన్ ద్వారాను, మిగిలిన 20 శాతం వేదికలోని కౌంటర్ల ద్వారాను అందుబాటులో ఉంచారు. మొత్తం టికెట్లు హాటు కేకుల్లా విక్రమైనట్లు ఆతిథ్య ఆంధ్రక్రికెట్ సంఘం ప్రకటించింది.

టికెట్ కనీసధర 500 రూపాయలు…

గత రెండేళ్లుగా కరోనా వైరస్ తో అతలాకుతలమైన క్రికెట్ అభిమానులు..కోవిడ్ ఉపశమన నేపథ్యంలో జరుగుతున్న విశాఖ మ్యాచ్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ టికెట్ కనీసధర ను 500 రూపాయలుగా నిర్ణయించారు. అత్యధికస్థాయి టికెట్ రేటు 6వేలుగా ఉంది.

సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఇప్పటికే 0-2తో వెనుకబడిన భారతజట్టు ఆరునూరైనా ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. దాంతో ఈ మ్యాచ్ సిరీస్ కే కీలకంగా మారడం కూడా ఎనలేని ఆసక్తిని రేపుతోంది.

భారత్ కు అచ్చొచ్చిన వేదిక ….

భారత్ కు అచ్చొచ్చిన వేదికగా విశాఖ స్టేడియానికి గుర్తింపు ఉంది. అంతేకాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో నిర్మించిన ఈ స్టేడియంలో రికార్డులు సైతం భారత్ కే అనుకూలంగా ఉన్నాయి.1988 నుంచి 2020 వరకూ విశాఖ వేదికగా భారత్ రెండు టెస్టులు, 15 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొంది. ఈ మ్యాచ్ ల్లో ఆతిథ్య భారత్ 90 శాతం విజయాలను నమోదు చేసింది.

భారత క్రికెట్ చరిత్రలో 24వ టెస్టు వేదికగా విశాఖ రికార్డుల్లో చేరింది. అంతేకాదు.. ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియం వేదికగా 1988, డిసెంబరు 10న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఇక్కడ వన్డే మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.

ఆ తర్వాత 1994, నవంబరు 4న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకున్నది. విల్స్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా 1996లో ఆస్ర్టేలియా-కెన్యా, 1999లో పెప్సీ కప్‌ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌- శ్రీలంక జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్‌లు ఆడాయి. చివరిగా 2001, ఏప్రిల్‌ 3న భారత్‌, ఆస్ర్టేలియా మధ్య జరిగిన వన్డేలో భారత్‌ ఓటమి పాలయింది.

డాక్టర్ వైఎస్ఆర్ స్టేడియం వేదికగా…

స్టీల్ సిటీ శివారులోని పోతిన మల్లయ్యపాలెంలో నిర్మించిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప్రస్థానం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల పోరుతో ప్రారంభమయింది. 2005, ఏప్రిల్‌ 5న ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ నిర్వహించారు. ఈ పోరులో భారత్ ను పాక్‌ కంగుతినిపించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు (ఏసీఏ) ఏకైక అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇదే కావడంతో బీసీసీఐ కేటాయించే మ్యాచ్‌లకు చిరునామాగా నిలిచింది.

2012లో తొలి టీ-20 మ్యాచ్..

2005లో తొలి వన్డేకి, 2012, సెప్టెంబరు 8న తొలి టీ20 మ్యాచ్‌కు, 2016 నవంబరు 17 నుంచి 21 వరకు తొలి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియానికి ఉంది.
ప్రస్తుత 2022 సిరీస్ లో భాగంగా జరిగే మూడో టీ-20 మ్యాచ్…విశాఖ వేదికగా జరుగుతున్న మూడో టీ-20 అంతర్జాతీయమ్యాచ్ కావడం విశేషం.

రిషభ్ పంత్ నాయకత్వంలోని భారతజట్టు తన లక్కీగ్రౌండ్ లో సఫారీలను కంగుతినిపించడం ద్వారా బోణీ కొట్టాలని, సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలని తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  14 Jun 2022 5:38 AM GMT
Next Story