Telugu Global
MOVIE UPDATES

కమల్ ను సత్కరించిన మెగాస్టార్

ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు చిరంజీవి. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా […]

కమల్ ను సత్కరించిన మెగాస్టార్
X

ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు చిరంజీవి.

ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ మాత్రం హాజరుకాలేకపోయాడు. ఇక అఖిల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  14 Jun 2022 6:03 AM GMT
Next Story