Telugu Global
MOVIE UPDATES

గాడ్సేలో హీరోయిన్ పాత్ర ఇదే

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా గాడ్సే. ఐశ్వర్య లక్ష్మీమీనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది. గాడ్సే లాంటి సందేశాత్మక చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య.. గాడ్సేలో తన పాత్ర ఛాయల్ని బయటపెట్టింది. “ఇందులో వైశాలి అనే ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాను. న‌టిగా న‌న్ను నేను ఎలివేట్ చేసుకోవ‌టానికి చాలా స్కోప్ ఉన్న రోల్ చేశాను. […]

aishwarya-laxmi-about-gadse
X

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా గాడ్సే. ఐశ్వర్య లక్ష్మీమీనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది. గాడ్సే లాంటి సందేశాత్మక చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య.. గాడ్సేలో తన పాత్ర ఛాయల్ని బయటపెట్టింది.

“ఇందులో వైశాలి అనే ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాను. న‌టిగా న‌న్ను నేను ఎలివేట్ చేసుకోవ‌టానికి చాలా స్కోప్ ఉన్న రోల్ చేశాను. నిజ జీవితంలో చాలా విష‌యాలను ప‌ట్టించుకోకుండా కూల్‌గా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను. కానీ ‘గాడ్సే’లో రియ‌ల్ లైఫ్‌కు విరుద్ధ‌మైన పాత్ర‌లో న‌టించాను. క‌థ విన‌గానే డిఫ‌రెంట్‌గా అనిపించ‌టంతో సినిమాలో న‌టించటానికి ఓకే చెప్పాను. తెలుగులో న‌టించ‌టం తొలిసారి కావ‌టంతో న‌టిగా చాలా హోం వ‌ర్క్ చేశాను. డైలాగ్స్‌తో పాటు ఎమోష‌న్స్‌పై కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేశాను. ఏదో డబ్బింగ్‌లో చూసుకుందాంలే అని యాక్ట్ చేయ‌లేదు. అలా చేయ‌ను కూడా. ఇలాంటి ఓ ఇన్‌టెన్స్ మూవీలో యాక్ట్ చేయ‌టం హ్యాపీగా అనిపించింది.”

ఇలా తన పాత్ర ఛాయల్ని బయటపెట్టింది ఐశ్వర్యలక్ష్మి. ఈ సినిమాలో తనకు, హీరో సత్యదేవ్ కు ఎలాంటి కాంబినేషన్ సీన్లు లేవని స్పష్టంచేసిన ఐశ్వర్య.. కేవలం కథను నమ్మి అంతా ఈ సినిమా చేసినట్టు తెలిపింది. ఈ పాత్ర కోసం రోజూ దినపత్రికలన్నీ చదివిందట ఈ హీరోయిన్. 17న థియేటర్లలోకి వస్తోంది గాడ్సే మూవీ.

First Published:  14 Jun 2022 6:09 AM GMT
Next Story