Telugu Global
National

బుకర్ ప్రైజ్ విజేతతో శ‌శి థరూర్… ఆనందంతో పొంగిపోయిన గీతాంజలి శ్రీ

నిత్యం వార్త‌ల్లో నిలిచే తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన జైపూర్ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌లో సైతం హైలైట్ అయ్యారు. ‘ఎ టూంబ్ ఆఫ్ శాండ్’ పుస్త‌కానికిగాను ఈ ఏడాది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న నవలా రచయిత్రి గీతాంజలి శ్రీతో క‌లిసి శ‌శిథ‌రూర్ స్ట్రాబెర్రీ టోస్ట్ షేర్ చేసుకున్నారు. ఇలా వారిద్ద‌రూ ఉన్న ఫోటోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోమవారం ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. “జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వేడుకగా ముగియడంతో గత […]

shashi-tharoor-with-booker-prize-winn
X

నిత్యం వార్త‌ల్లో నిలిచే తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన జైపూర్ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌లో సైతం హైలైట్ అయ్యారు. ‘ఎ టూంబ్ ఆఫ్ శాండ్’ పుస్త‌కానికిగాను ఈ ఏడాది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న నవలా రచయిత్రి గీతాంజలి శ్రీతో క‌లిసి శ‌శిథ‌రూర్ స్ట్రాబెర్రీ టోస్ట్ షేర్ చేసుకున్నారు. ఇలా వారిద్ద‌రూ ఉన్న ఫోటోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోమవారం ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

“జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వేడుకగా ముగియడంతో గత రాత్రి లండన్‌లో బ‌ర్త్‌డే గర్ల్ అయిన నవలా రచయిత్రి గీతాంజలి శ్రీని స్ట్రాబెర్రీతో టోస్ట్ చేశా” అని థ‌రూర్ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.

లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 15వ ఎడిషన్ జూన్ 10 నుండి జూన్ 12 వరకు జరిగింది. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ని గెలుచుకున్న మొదటి భారతీయ భాషా పుస్తకంగా కూడా ‘ఎ టోంబ్ ఆఫ్ సాండ్’ నిలిచింది, ఉత్తర భారతదేశానికి చెందిన‌ 80 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరిగే క‌థే ఈ పుస్త‌కం ఇతివృత్తంగా ఉంది. గీతాంజలి శ్రీ ర‌చించిన రెట్ సమాధి పుస్త‌కం కూడా 2018లో ప్రచురించబడింది. “నేను బుకర్ గురించి కలలో కూడా ఊహించలేదు, ఇంత పెద్ద గుర్తింపును చూసి నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషంగా ఉన్నాను,ఈ అవార్డుతో నేను మరింత‌ వినయంగా ఉంటాను” అంటూ గీతాంజ‌లిశ్రీ వేదిక‌పై చెప్పుకున్నారు.

హిందీలో రాసిన పుస్త‌కానికి ఇంత పెద్ద అవార్డు రావ‌డం, నాలాంటి ర‌చ‌యిత‌ల్లో ఎంతో ఉత్సాహం నింపిందంటూనే, ద‌క్షిణాసియా భాష‌ల్లో గొప్ప‌గా అభివృద్ధి చెందుతున్న సాహిత్య సంప్ర‌దాయాల్లోనే ప్ర‌పంచ సాహిత్యం ఉంద‌న్న నిజాన్ని గుర్తించాల‌న్నారు. ఈ అవార్డు కింద గీతాంజలి శ్రీ దాదాపు 4.7 కోట్ల రూపాయల‌ విలువైన ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఈ అవార్డు మొత్తాన్ని ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువ‌దించిన డైసీ రాక్‌వెల్‌తో క‌లిసి పంచుకున్నారు.

First Published:  13 Jun 2022 6:21 AM GMT
Next Story