Telugu Global
MOVIE UPDATES

అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా చేశా – రానా

రానా లాంటి హీరో తలుచుకుంటే ఓ పెద్ద యాక్షన్ సినిమా చేయొచ్చు. కానీ సాయిపల్లవి చుట్టూ తిరిగే విరాటపర్వం లాంటి సినిమా ఎందుకు చేశాడు. దీనికి రానా దగ్గర సమాధానం ఉంది. వరంగల్ లో జరిగిన ఆత్మీయ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించాడు రానా. “విరాటపర్వం ఎందుకు చేస్తున్నారు? పెద్ద యాక్షన్ మూవీ చేయొచ్చు కదా? అని చాలా మంది నన్ను అడిగేవారు. చాలాసార్లు సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్లు కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ […]

rana
X

రానా లాంటి హీరో తలుచుకుంటే ఓ పెద్ద యాక్షన్ సినిమా చేయొచ్చు. కానీ సాయిపల్లవి చుట్టూ తిరిగే విరాటపర్వం లాంటి సినిమా ఎందుకు చేశాడు. దీనికి రానా దగ్గర సమాధానం ఉంది. వరంగల్ లో జరిగిన ఆత్మీయ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించాడు రానా.

“విరాటపర్వం ఎందుకు చేస్తున్నారు? పెద్ద యాక్షన్ మూవీ చేయొచ్చు కదా? అని చాలా మంది నన్ను అడిగేవారు. చాలాసార్లు సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్లు కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ కోసం. ఈసారి ఈ సినిమా ఎందుకు చేశానంటే.. చప్పట్ల మధ్యలో నిశబ్ధంగా కూర్చుని ఇది నిజమే కదా..అని ఒకరు చూస్తుంటాడు. అలాంటివారి కోసమే ఈ సినిమా చేశా. దర్శకుడు వేణు ఈ సినిమా అద్భుతంగా రాశారు. తీశారు. తెలంగాణలో కట్టె పుల్లని పట్టుకున్నా కవిత్వం వస్తుందని వేణు గారు చెప్పారు. అది నిజం. ఇలాంటి గొప్ప కథలు ఎన్నెన్నో చెప్పదలచుకున్నాం.

జూన్ 17న థియేటర్లలోకి వస్తోంది విరాటపర్వం. రానా-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వేణు ఊడుగుల డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. నవీన్ చంద్ర, ప్రియమణి లాంటి చాలామంది నటీనటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు.

First Published:  13 Jun 2022 2:14 AM GMT
Next Story