Telugu Global
MOVIE UPDATES

భలేగా కవర్ చేసిన నాని

అంటే సుందరానికి సినిమాపై ఎన్ని పాటిజివ్ రివ్యూస్ ఉన్నాయో, అన్నే నెగెటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏమంత భారీగా రాలేదు. బ్రేక్ ఈవెన్ పై కూడా అనుమానాలున్నాయి. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు నాని మాత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ అంటున్నాడు. దానికో కొత్త అర్థం కూడా ఇచ్చాడు. “‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు […]

nani-covering-on-ante-sundaraniki
X

అంటే సుందరానికి సినిమాపై ఎన్ని పాటిజివ్ రివ్యూస్ ఉన్నాయో, అన్నే నెగెటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏమంత భారీగా రాలేదు. బ్రేక్ ఈవెన్ పై కూడా అనుమానాలున్నాయి. ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు నాని మాత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ అంటున్నాడు. దానికో కొత్త అర్థం కూడా ఇచ్చాడు.

“‘అంటే సుందరానికీ’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం.”

ఇలా తన సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కవర్ చేస్తున్నాడు నాని. పైగా ఈ సినిమా ఇప్పుడు క్లిక్ అవ్వకపోయినా, రోజులు గడిచేకొద్దీ క్లాసిక్ అవుతుందంటున్నాడు. అంటే సుందరానికి సినిమా ఆవకాయ్ లాంటిదని, రోజురోజుకు ఊరుతుందని, రుచి ఇంకా పెరుగుతుందని చెబుతున్నాడు. రెండేళ్ల తర్వాత మంచి సినిమాల పేర్లు చెప్పమంటే 2-3 సినిమాల్లో అంటే సుందరానికి ఉంటుందంటున్నాడు.

First Published:  13 Jun 2022 8:29 AM GMT
Next Story