Telugu Global
National

ఇంగ్లిష్‌లో 35, లెక్క‌ల్లో 36.. క‌లెక్ట‌ర్ టెన్త్ మార్కుల‌ లిస్ట్ వైర‌ల్‌

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న‌విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు, త‌క్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు నిరాశ‌, నిస్పృహ‌ల‌కు లోనవ్వ‌కుండా భ‌రోసానిచ్చేందుకు ఓ ఐఏఎస్ అధికారి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా వైర‌ల్‌గా మారింది. ఇంగ్లిష్‌లో వంద‌కు 35, గ‌ణితంలో వందకు 36 మార్కులు మాత్ర‌మే తెచ్చుకున్నా.. కుంగిపోకుండా, నిరాశ‌ప‌డ‌కుండా ఐఏఎస్‌కు ఎంపికైన ఆ అధికారి పేరు తుషార్ డి. సుమేరా. ఆయ‌నిప్పుడు గుజ‌రాత్ రాష్ట్రంలోని భ‌రూచ్ జిల్లా క‌లెక్ట‌ర్‌. ఆయ‌న ప‌దో త‌ర‌గ‌తి అన్ని […]

ias-officer-tushar-d-sumera-tenth-class-marks-list-has-gone-viral-in-social-media
X

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న‌విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు, త‌క్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు నిరాశ‌, నిస్పృహ‌ల‌కు లోనవ్వ‌కుండా భ‌రోసానిచ్చేందుకు ఓ ఐఏఎస్ అధికారి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా వైర‌ల్‌గా మారింది. ఇంగ్లిష్‌లో వంద‌కు 35, గ‌ణితంలో వందకు 36 మార్కులు మాత్ర‌మే తెచ్చుకున్నా.. కుంగిపోకుండా, నిరాశ‌ప‌డ‌కుండా ఐఏఎస్‌కు ఎంపికైన ఆ అధికారి పేరు తుషార్ డి. సుమేరా. ఆయ‌నిప్పుడు గుజ‌రాత్ రాష్ట్రంలోని భ‌రూచ్ జిల్లా క‌లెక్ట‌ర్‌. ఆయ‌న ప‌దో త‌ర‌గ‌తి అన్ని స‌బ్జెక్టుల్లోనూ మార్జిన్ మార్కులే సాధించారు. కానీ, జీవితంలో అనుకున్న ల‌క్ష్యాన్ని మాత్రం సాధించారు. అదే స్ఫూర్తి విద్యార్థుల్లో నింపాల‌ని ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ IAS అధికారి అయిన అవనీష్ శరణ్, టెన్త్‌ రిపోర్ట్ కార్డ్‌తో పాటు సుమేరా చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈ ట్వీట్‌పై తుషార్ డి. సుమేరా కూడా స్పందిస్తూ.. త‌న మార్కుల జాబితాను షేర్ చేసిన మిస్టర్ శరణ్‌కి కృతజ్ఞత‌లు తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తిలో సాదాసీదా మార్కులు తెచ్చుకున్న సుమేరాను స్కూల్లోనేకాదు, గ్రామంలో కూడా అంద‌రూ చిన్న‌చూపు చూసిన‌ విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి సుమేరా ప‌ట్టుద‌ల‌తో 2012లో IAS అధికారి అయ్యాడు. అతను ఆర్ట్స్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం తెచ్చుకున్నారు. ఆ త‌రువాత UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారు. కాగా, ఈ ఏడాది యూపీఎస్సీ పరీక్ష ఫ‌లితాల్లో శృతి శర్మ టాపర్‌గా నిలిచింది. అంకితా అగర్వాల్‌, గామిని సింగ్లా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

First Published:  13 Jun 2022 7:00 AM GMT
Next Story