Telugu Global
National

హీరోయిన్ అనుష్క సోదరుడు గ్యా‍ంగ్ స్టర్….ఆయన హత్యకు కుట్ర‌

టాలీవుడ్ నటి అనుష్క (అనుష్క శెట్టి) సోదరుడు గుణరంజన్ శెట్టి ఒక గ్యాంగ్ స్టర్. ప్రస్తుతం ఆయనను హత్య చేసేందుకు మరో గ్యాంగ్ కుట్ర చేసినట్టు తెలుస్తోంది. మంగళూరుకు చెందిన ప్రముఖ మాఫియా డాన్ ముత్తప్పరాయ్ జీవించి ఉన్నప్పుడు మన్విత్ రాయ్, గుణరంజన్ శెట్టి అతనికి కుడి, ఎడమ భుజాల వలె ఉండేవారు. అతను చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు విడిపోవడమే కాక బద్ద శతృవులుగా మారిపోయారు. గుణరంజన్ శెట్టిని, మన్విత్ రాయ్ హత్య చేసేందుకు పథకం […]

anushka shetty, gunaranjan shetty
X

టాలీవుడ్ నటి అనుష్క (అనుష్క శెట్టి) సోదరుడు గుణరంజన్ శెట్టి ఒక గ్యాంగ్ స్టర్. ప్రస్తుతం ఆయనను హత్య చేసేందుకు మరో గ్యాంగ్ కుట్ర చేసినట్టు తెలుస్తోంది. మంగళూరుకు చెందిన ప్రముఖ మాఫియా డాన్ ముత్తప్పరాయ్ జీవించి ఉన్నప్పుడు మన్విత్ రాయ్, గుణరంజన్ శెట్టి అతనికి కుడి, ఎడమ భుజాల వలె ఉండేవారు. అతను చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు విడిపోవడమే కాక బద్ద శతృవులుగా మారిపోయారు.

గుణరంజన్ శెట్టిని, మన్విత్ రాయ్ హత్య చేసేందుకు పథకం రచిస్తున్నట్లు సమాచారం. అయితే మన్విత్ రాయ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. గుణరంజన్ హత్యకు బంట్వాల్‌లోని ముత్తప్ప రాయ్ సన్నిహితుడు రంగేష్ మల్లియన్ స్కెచ్ వేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ విషయంపై రంగేష్ మల్లియన్ ను మంగళూరు పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు.

కాగా ముత్తప్పరాయ్ స్థాపించిన జయ కర్ణాటక సంస్థ నుంచి బయటకు వచ్చిన గుణరంజన్ శెట్టి జయ కర్ణాటక జనతా పార్టీ ఫోరమ్‌ను స్థాపించారు. ఈ ఫోరమ్ తరపున మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. తమ నాయకుడిపై అసూయతోనే మన్విత్ రాయ్ అతన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారని గుణరంజన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. తన‌కు భద్రత కల్పించాలని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్రను ఆదివారం గుణరంజన్‌ కోరారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను మన్విత్ రాయ్ ఖండించారు. తాను విదేశాల్లో ఉన్నానని, ఈ హత్యా పథకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, తనపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Next Story